
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. నాగార్జున(Nagarjuna), ఆమిర్ ఖాన్(Amir Khan), శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, పూజా హెగ్డే వంటి స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా హైప్‌ను మరింత పెంచింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీతో ఈ చిత్రం సాంకేతికంగా అద్భుతంగా తెరకెక్కింది. మరి యూఎస్‌లో ప్రీమియర్స్(US Premiers) చూసిన ఫ్యాన్స్ ‘కూలీ’పై ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారో ఓ లుక్ వేద్దామా..
రజినీకాంత్ హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్
సోషల్ మీడియా(Social Media)లో ‘కూలీ’ గురించి పబ్లిక్ టాక్ హోరెత్తుతోంది. రజినీకాంత్ హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఆయన నటనా విశ్వరూపం అభిమానులను ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. లోకేష్ కనగరాజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటర్వెల్ బ్యాంగ్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లు థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించాయని ప్రేక్షకులు పేర్కొంటున్నారు. నాగార్జున విలన్ పాత్రలో అద్భుతంగా నటించారని కొనియాడుతున్నారు.
#Coolie public talk super hit 🔥🔥🔥 pic.twitter.com/KvMxmEVHqf
— yadav (@madhuholicc) August 13, 2025
డ్యాన్స్‌తో అదరగొట్టిన పూజా హెగ్డే
ఇక బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కామియో రోల్, శ్రుతి హాసన్(Shruti Haasan) ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు మరింత బలం చేకూర్చాయంటుని ఓ ఫ్యాన్ కామెంట్ చేశాడు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిందని అభిమానులు చెబుతున్నారు. ఇక స్పెషల్ సాంగ్ ‘మోనికా బెలూచీ’లో పూజా హెగ్డే డ్యాన్స్‌తో అదరగొట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్‌గా కూలీకి నెటిజన్లు పాజిటివ్ టాక్‌నే అందిస్తున్నారు.
#Coolie – Interval
Lokesh masala minus the usual highs. Opened up enough tracks to go full blast in the second half though. 3 songs, one fight, King Nag oozing style and lighting up the screen whenever he shows up, a fresh looking Thalaivar. Fingers crossed for the second half… pic.twitter.com/PJ8qBQi7XB
— Mollywood BoxOffice (@MollywoodBo1) August 14, 2025
పాజిటివ్ టాక్‌ను రిఫ్లెక్ట్ చేస్తున్న క్రిటిక్ రివ్యూలు
ఈ మేరకు క్రిటిక్ రివ్యూలు కూడా సినిమాకు పాజిటివ్ టాక్‌ను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. అయితే, సినిమాకు ‘A’ సర్టిఫికెట్ రావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్టిఫికెట్ కారణంగా రూ. 1000 కోట్ల కలెక్షన్స్ లక్ష్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, రజినీకాంత్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోలీవుడ్‌లో చరిత్ర సృష్టిస్తుందని ధీమాగా ఉన్నారు. బుక్ మై షోలో రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయి. ప్రీమియర్ షోల రివ్యూలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.