ICC Men’s ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ రిలీజ్.. టాప్-10లో నలుగురు మనోళ్లే!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా 2025 ఆగస్టు 13న మెన్స్ వన్డే ఇంటర్నేషనల్ (ODI) ర్యాంకింగ్స్‌(Rankings)ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు(Team India) 4471 పాయింట్లతో, 124 రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో విజయం సాధించడం, ఇంగ్లండ్‌(England)పై 3-0 సిరీస్ విజయంతో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. న్యూజిలాండ్ (4160 పాయింట్లు, 109 రేటింగ్) రెండో స్థానంలో, ఆస్ట్రేలియా (3473 పాయింట్లు, 109 రేటింగ్) మూడో స్థానంలో ఉన్నాయి. శ్రీలంక(Srilanka) ఇటీవల ఆస్ట్రేలియాపై 2-0 విజయంతో నాలుగో స్థానానికి (4009 పాయింట్లు, 103 రేటింగ్) ఎగబాకగా, పాకిస్థాన్(Pakisthan) ఐదో స్థానానికి (3465 పాయింట్లు, 102 రేటింగ్) పడిపోయింది.

Four options for the No.4 spot in India's ODI team for the Champions Trophy  2025

రోహిత్ ఆడకపోయినా రెండో స్థానంలోకి..

ఇక వ్యక్తిగత బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) 784 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) 756 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం వెస్టిండీస్‌పై విఫలమవడంతో మూడో స్థానానికి (751 పాయింట్లు) పడిపోయాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli 736 పాయింట్లు) నాలుగో స్థానంలో, శ్రేయాస్ అయ్యర్ (Shreyas Ayyar)ఎనిమిదో, కెఎల్ రాహుల్ 15వ స్థానంలో నిలిచారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ 680 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, భారత్‌కు చెందిన కుల్దీప్ యాదవ్(Kuldeep Yadhav) 650 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఆల్ రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా టాప్

ఇక ఆల్ రౌండర్ల విషయానికొస్తే.. టీమ్ఇండియా ప్లేయర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లా ఆటగాడు మెహదీ హసన్ రెండు, ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్(Ben Stokes) మూడు, సౌతాఫ్రికా ఆటగాడు వియాన్ మల్డర్(Wiyaan Muder) నాలుగు, ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమ్ విభాగంలో సౌతాఫ్రికా(SA) 6, అఫ్గానిస్థాన్(AFG) 7, ఇంగ్లండ్(ENG) 8, వెస్టిండీస్(WI) 9, బంగ్లాదేశ్(BAN) 10వ ర్యాంకులో నిలిచాయి. ఈ ర్యాంకింగ్స్ జట్లు, ఆటగాళ్ల ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ వెల్లడించింది.

After Rohit Sharma, Ravindra Jadeja quashes ODI retirement speculations:  'No unnecessary rumours'

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *