రాజీవ్ కనకాల(Rajiv Kanakala).. 1991లో వచ్చిన బాయ్ ఫ్రెండ్(Boy Friend) చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన దేవదాస్ కనకాల(Devadas Kanakala) తనయుడే రాజీవ్. రాంబంటు సినిమాలో జయకృష్ణ పాత్ర నుంచి.. స్టూడెంట్ నం.1లో సత్య, సై మూవీలో రగ్బీ కోచ్‌గా రఫీ మెప్పించాడు. ఇక ఈ ఏడాది వచ్చిన గేమ్ ఛేంజర్, బ్రహ్మా ఆనందం, తల, డియర్ ఉమ తదితరల చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. రీసెంటుగా ఆయన చేసిన ‘హోమ్ టౌన్(Home Town)’ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అప్పుడు మా నాన్న ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు..
ఇప్పటి వరకూ ఆయన 120కి సినిమాల్లో నటించగా.. పలు వెబ్ సిరీస్‌లు, TV సీరియళ్లలోనూ కనిపించి బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా తన లైఫ్‌లో జరిగిన అనేక విషయాలను రాజీవ్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.”1988లో మా ఫాదర్ 40 లక్షలను వడ్డీకి తెచ్చి మరీ ఒక ప్రాపర్టీ కొన్నారు. ఆ విషయంలో అవతలవారు ఆయనను మోసం చేశారు. ఫలితంగా అప్పులు(Loans), వడ్డీలు మాత్రమే మిగిలాయి” అని అన్నాడు. ఆ రోజులలోనే నెలకి 30 వేల నుంచి 40 వేలు వడ్డీలు(Interests) కట్టవలసి వచ్చేది. ఈ కారణంగా ఇంట్లో గొడవలు అవుతూ ఉండేవి. ఆ సమయంలో నాన్నగారు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. ఆ విషయం అమ్మ చెబితే.. మా నాన్నకు నేనే ధైర్యం చెప్పాను. ఎనో కష్టాలు పడుతూ ఆ అప్పు తీర్చాం’’ అని చెప్పుకొచ్చాడు.

మాపై చాలా పుకార్లు సృష్టించారు..
ఇక నేను, సుమ(Suma Kanakala) విడాకులు తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. కొన్ని కారణాల వలన నేను మా నాన్నతో కలిసి పాత ఇంట్లో ఉన్నానన్నారు. ఆ సమయంలో ఇలాంటి పుకార్లు సృష్టించారు కానీ అవన్నీ నిజం కాదు . ఇక మీరంతా అనుకుంటున్న స్థాయిలో మాకు ఆస్తులు లేవు. ఉన్నది ఒకటే ఇల్లు. కొంతమంది తమ వెంచర్లో ప్లాట్లు అమ్ముకోవడం కోసం, సుమ-రాజీవ్ కనకాల వాళ్లు తీసుకున్నారని కస్టమర్లతో చెబుతున్నారట. దాంతో మాకు చాలా చోట్ల ల్యాండ్స్ ఉన్నాయని అనుకుంటున్నారు. నిజానికి అదంతా ప్రచారం మాత్రమే” అని రాజీవ్ స్పష్టం చేశాడు.
Rajiv Kanakala to the producer, when he was asked to sign a film in which, he doesn’t die and lives till the climax end… pic.twitter.com/SiS6FzYO6B
— Roop (@Roop_Kumar_) February 28, 2025








