TG: ‘రాజీవ్ యువ వికాసం’ స్కీమ్.. దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్!

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అత్యం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam)’ పథకం దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అయితే దరఖాస్తు(Apply) చేసే సమయంలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నయని గడువు పెంచాలని యువత(Youth) డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ ఏప్రిల్ 14 వరకూ అవకాశం ఇచ్చింది. కానీ గత మూడు రోజులుగా సర్వర్ డౌన్‌(Server Down) కారణంగా దరఖాస్తు చేసుకోవడం యువతకు కష్టంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు(Internet Issue) తీవ్రంగా ఉన్నాయి, దీని వల్ల అనేక మంది అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయలేకపోతున్నారు.

12 లక్షలకు పైగా దరఖాస్తులు

ఈ సమస్యల వల్ల దరఖాస్తు గడువును పొడిగించాలని యువత, స్థానిక నాయకులు కోరుతున్నారు. ఇప్పటివరకు 12 లక్షలకు పైగా దరఖాస్తులు(Applications) అందినట్లు అధికారులు తెలిపారు, అయితే సాంకేతిక లోపాల వల్ల ఇంకా ఎంత మంది దరఖాస్తు చేయలేకపోతున్నారో స్పష్టంగా తెలియడం లేదు. ఈ పథకం కింద SC, ST, BC, మైనారిటీ సామాజిక వర్గాల యువతకు స్వయం ఉపాధి కోసం ₹3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు, ఇందులో సబ్సిడీలు కూడా ఉన్నాయి.

ఎవరెవరికి ఎంత సాయం అందిస్తారంటే..

కాగా రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం చిరు వ్యాపారులకు, EBC (ఎకనామికలీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్) వారికి 100 శాతం రాయితీతో రూ.50,000 వరకు రుణం అందిస్తోంది. లక్ష రూపాయల లోపు రుణం తీసుకుంటే, 90 శాతం రాయితీ ఇస్తారు. అంటే, రూ.లక్ష రుణం తీసుకుంటే, లబ్ధిదారుడు కేవలం రూ.10,000 మాత్రమే తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య రుణం తీసుకుంటే, 80% రాయితీ లభిస్తుంది. ఉదాహరణకు, రూ.2,00,000 రుణం తీసుకుంటే, రూ.40,000 చెల్లిస్తే చాలు. రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల లోపు రుణాలకు 70% రాయితీ ఉంటుంది. అంటే, రూ.4,00,000 రుణం తీసుకుంటే, రూ.1,20,000 తిరిగి చెల్లించాలి. దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్‌ https://tgobmmsnew.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి.

Related Posts

Esha Gupta: హార్దిక్, నేను కొంతకాలం మాట్లాడుకున్నాం: బాలీవుడ్ నటి

టీమ్‌ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya)తో బాలీవుడ్ నటి ఇషా గుప్తా (Esha Gupta) డేటింగ్లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని, ప్రేమలో మునిగిపోయారని సోషల్ మీడియాలో జనాలు తెగ చర్చించుకున్నారు. అయితే…

SS Rajamouli: జపాన్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. వైరల్ వీడియోలు

అగ్ర దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ఓ వీడియో గేమ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ వీడియో గేమ్కు సంబంధించిన విజువల్స్‌, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీడియో గేమ్ల రూపకల్పనకు జపాన్ పెట్టింది పేరు. అక్కడ రూపొందిన వీడియో గేమ్లు ప్రపంచవ్యాప్తంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *