
కర్ణాటక(Karnataka) హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసి, బాలిక గొంతు నులిమి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్(Encounter) చేసి హతమార్చారు. నిందితుడి(accused)ని బిహార్(Bihar)కు రాష్ట్రానికి చెందిన నితేష్ కుమార్(35)గా గుర్తించారు. పోలీసులతో జరిగిన ఘర్షణ తర్వాత ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేసే క్రమంలో ప్రతిఘటించడంతో పోలీసులు కాల్చి చంపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
బాలిక గొంతునులిమి హత్య
నిందితుడు ఐదేళ్ల బాలిక(Girl)ను ఒక షెడ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి(Rape Attempt) యత్నించాడు. అయితే, బాలిక అరుపులు విన్న స్థానికులు షెడ్ వైపు వెళ్లారు. ఆ సమయంలో బాలిక గొంతు నులిమి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను నిందితుడు ఎత్తుకెళ్లినట్లుగా CCTVలో రికార్డైంది. పోలీసులు ముందుగా హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరిపినా నిందితుడు లొంగలేదని, దీంతో అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారని హుబ్బళ్లి పోలీస్ చీఫ్ శశి కుమార్ వెల్లడించారు.
The accused of 5 yrs old baby kidnapper & killer (alleged rapist) has been killed in the encounter.
The incident occurred at the Ashok Nagar police station limits here and the body was found in an abandoned building.Accused in the brutal murder of a five-year-old girl was shot… pic.twitter.com/njOgGswJoR— Karnataka Portfolio (@karnatakaportf) April 13, 2025
కాగా ఈ కాల్పులు ఒక మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన నితీష్ కుమార్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దారుణమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.