ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ అప్‌కమింగ్ సినిమా గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)తో చరణ్ ఓ సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ సూచన మేరకు త్రివిక్రమ్ రామ్ చరణ్ కోసం ఒక కథను సిద్ధం చేశారని.. ఆ కథను వినిపించగా చరణ్ ఓకే చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ చిత్రానికి పవన్ కల్యాణే నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.
వెంకటేశ్‌తో సినిమా తర్వాత రామ్ చరణ్ మూవీ!
త్రివిక్రమ్ చివరి సినిమా ‘గుంటూరు కారం’ తర్వాత తన తదుపరి చిత్రం గురించి అధికార ప్రకటన ఏదీ రాలేదు. మొదట అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనుకున్నప్పటికీ.. అట్లీ దర్శకత్వంలో సినిమాతో బన్నీ బిజీగా ఉండటంతో త్రివిక్రమ్ మూవీ వాయిదా పడింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్తో ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ సిద్ధమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన రాలేదు. వెంకటేశ్‌తో సినిమా తర్వాత రామ్ చరణ్‌తో చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నట్లు సమాచారం.
30 శాతం షూటింగ్ పూర్తయిన పెద్ది
ప్రస్తుతం రామ్చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) సినిమా చేస్తున్నారు. చరణ్ సరసన హీరోయిన్గా జాన్వీకపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో ముస్తాబవుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయ్యింది. ఆ తర్వాత చరణ్ సుకుమార్‌తో ఓ మూవీ చేస్తున్నారు. దానితో పాటే త్రివిక్రమ్ సినిమా కూడా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.






