
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ మధ్య ఏవో విభేదాలు వచ్చాయంటూ రెండ్రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. దీనికి కారణం రామ్ చరణ్ తమన్ ను సామాజిక మాధ్యమాల్లో అన్‌ఫాలో అవ్వడమేనని న్యూస్ వైరల్ అవుతోంది. చెర్రీ నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ ఎన్నో అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వైఫల్యంలో తమన్ మ్యూజిక్ కూడా భాగమేనని చెర్రీ భావిస్తున్నట్లు నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతోంది. అందుకే ఆయన తమన్ ను అన్ ఫాలో చేశాడని నెటిజన్లు భావిస్తున్నారు.
అబ్బే అదేం లేదండి
అయితే దీనిపై తాజాగా రామ్ చరణ్ టీమ్ (Ram Charan Team) క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ అసలు ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది. రామ్ చరణ్ సాధారణంగా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరని, ఆయన చాలా తక్కువ మందినే ఫాలో అవుతున్నారని చెర్రీ టీమ్ వెల్లడించింది. ఆయన ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులు మాత్రమే ఆయన ఫాలోయింగ్ లిస్టులో ఉంటారని పేర్కొంది. చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను (SS Thaman) అన్‌ఫాలో అయ్యారనే వార్తల్లో నిజం లేదని అసలు సంగతి చెప్పుకొచ్చింది.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల తమన్ ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer Songs) పాటల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. యూట్యూబ్‌లో ఈ పాటలకు ఎక్కువ వ్యూస్ రాలేదని అన్నాడు. ‘‘గేమ్ ఛేంజర్’ పాటలు బాగానే వచ్చినా తాను అనుకున్నంత హైప్ ఆ పాటలకు రాలేదని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఆ పాటల్లో ఒక్క దాంట్లో కూడా హుక్ స్టెప్ లేదని తమన్ పేర్కొన్నాడు. ‘రా మచ్చా..’, ‘నానా హైరానా (Nana Hairana Song)’, ‘జరగండి జరగండి..’ సాంగ్స్ ఎంత బాగున్నా.. వాటిలో ఒక్క హుక్ స్టెప్ కూడా లేకపోవడం వల్ల ఆడియెన్స్ కు రీచ్ కాలేదని అందుకే వ్యూస్ రాలేదని తమన్ తెలిపాడు. తమన్ కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.