బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ టీమ్

బెట్టింగ్ యాప్స్ మాఫియా (Betting Apps Mafia)పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో ఈ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయకుల ప్రాణాలు బలయ్యేలా చేస్తున్న సినీ ప్రముఖులపై కొరడా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలకు పోలీసు శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మరోవైపు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతోంది. అయితే పోలీసుల నోటీసులు అందుకున్న వారిలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా ఉన్నాడు.

విజయ్ వాటిని ప్రమోట్ చేయరు

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయలేదని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్​ గేమ్స్​ను మాత్రమే విజయ్ ప్రమోట్ చేశాడని చెప్పుకొచ్చింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ (Skilled Base Games) అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా ఉన్నాడని తెలిపింది. విజయ్ తాను ప్రమోట్ చేసే కంపెనీ, ప్రాడక్ట్​కు చట్టప్రకారం అనుమతి ఉందని నిర్ధారించుకున్నాకే వాటి కోసం పని చేస్తారని వెల్లడించింది.

అది స్కిల్ బేస్డ్ గేమ్ 

“అన్ని అనుమతులున్న ఏ 23 (A23) అనే సంస్థకు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్​గా పని చేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు (Supreme Court) చెప్పింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్​కు ఎలాంటి సంబంధం లేదు. అనధికారికంగా పని చేస్తున్న ఏ సంస్థకూ విజయ్ ప్రచారకర్తగా వ్యవహారించలేదు.” అని ఆయన పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *