‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్.. అప్డేట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్

‘స్టీవ్.. చూడు ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో.. మనం కూడా మన గుడారానికి సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగితేలాల్సిందే’.. ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా నీలో.. అబ్బ కమల్ హాసన్’… ఈ డైలాగ్స్ వింటే మనం ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమైపోయి ఉంటుంది కదా. అదేనండి.. ‘ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)’ మూవీ గురించి. 2018లో తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్

ఈ సినిమాలో విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమఠం, సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కామియో రోల్ చేశాడు.  సోషల్ మీడియాలో మీమ్స్ వల్ల యూత్​కు ఈ సినిమా బాగా ఎక్కేసింది. ఇటీవల రీ రీలిజ్​కు విపరీతమైన క్రేజ్ దక్కింది. చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్ ఉందంటూ తరుణ్ భాస్కర్ గతంలో చెప్పారు. దీంతో ఈ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తరుణ్ భాస్కర్​ ఇన్​స్టా స్క్రీన్​షాట్

ఈ ఏడాది బాకీలు తీర్చాలి

తాజాగా ఈ సినిమాపై తరుణ్ భాస్కర్ (Tharun Bhascker Dhaassyam) ఓ అప్డేట్ ఇచ్చారు. తన ఇన్​స్టాగ్రామ్​లో ఆయన ఓ సాలిడ్ అప్డేట్ షేర్ చేశారు. ‘ఈ’ అనే అక్షరాన్ని హైలైట్ చేస్తూ ‘ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలి’ అని స్టోరీలో పెట్టారు. దీంతో ఆయన ‘ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi 2 update)’ సినిమా సీక్వెల్ గురించే మాట్లాడారంటూ నెటిజన్లు సంబుర పడుతున్నారు.  సీక్వెల్ పనులు ఈ ఏడాదే వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై తరుణ్ భాస్కర్ అధికారిక ప్రకటన చేసే వరకు క్లారిటీ రాదు. నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్​ చుట్టూ తిరిగే కథను డైరెక్టర్ తరణ్ తక్కువ బడ్జెట్​లో అద్భుతంగా తెరకెక్కించారు.

Related Posts

Shiva Shakti Datta: టాలీవుడ్‌లో విషాదం.. ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తిదత్తా కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) తండ్రి, ప్రసిద్ధ సినీ గేయ రచయిత శివ శక్తి దత్తా (Shiva Shakti Datta) కన్నుమూశారు. 93 ఏళ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్…

Pune Highway: ఓటీటీలో దుమ్మురేపుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘పుణే హైవే’

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్లు .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల(Investigative thrillers)కు OTTలలో ఇప్పుడు విశేషమైన ఆదరణ లభిస్తోంది. అదే విషయాన్ని ‘పుణే హైవే(Pune Highway)’ సినిమా మరోసారి నిరూపిస్తోంది. భార్గవ కృష్ణ – రాహుల్(Bhargava Krishna-Rahul) దర్శకత్వం వహించిన ఈ సినిమా మే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *