Mana Enadu : నేషనల్ అవార్డు విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో రష్మిక మందన్న హీరోయిన్ గా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప ది రూల్’ (Pushpa 2 : The Rule). ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా బన్నీ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ కు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి.
పుష్పరాజ్ బ్లాక్ బస్టర్ హిట్
ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా (Pushpa 2 Block Buster) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా పుష్ప-2 సినిమా గురించే చర్చ జరుగుతోంది. నెటిజన్లతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
అల్లు ఈజ్ మెగా మెగా స్టార్
CONGRATS to @alluarjun and team for giving a ALL INDIA INDUSTRY HIT ..
ALLU is MEGA MEGA MEGA MEGA MEGA— Ram Gopal Varma (@RGVzoomin) December 5, 2024
పుష్ప 2 ది రూల్ సినిమాతో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అల్లు అర్జున్‌తో పాటు చిత్ర బృందానికి ఆర్జీవీ (RGV Pushpa 2 Tweet) అభినందనలు తెలిపాడు. అల్లు అర్జున్ ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా స్టార్ అంటూ ఆసక్తికర పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పుష్ప 2 విడుదలకు ముందు కూడా మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని, కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అని వర్మ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.







