రాంగోపాల్‌ వర్మకు బిగ్‌ షాక్‌.. ఆ కేసులో జైలుశిక్ష

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (Ram Gopal Varma)కు భారీ షాక్‌ తగిలింది. ఆరేళ్ల క్రితం కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్‌ కోర్టు (Andheri Magistrate court) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తేల్చింది. మరోవైపు మూడు నెలలు జైలుశిక్ష కూడా విధించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఆరేళ్ల కిందటి కేసు

ముంబయిలో 2018లో రాంగోపాల్‌ వర్మపై చెక్‌బౌన్స్‌ కేసు (cheque bounce case) నమోదయింది. మహేశ్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు.

మూడు నెలలు జైలుశిక్ష

వర్మ తీరుతో ఆగ్రహించిన కోర్టు అతడిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ (non bailable warrant issued) చేసింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. లేని యెడల మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తాజాగా మెజిస్ట్రేట్‌ తీర్పు వెల్లడించింది. దీనిపై ఆర్జీవీ స్పందించాల్సి ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *