రమణ గోగుల (Ramana Gogula).. టాలీవుడ్ కు పాప్ కల్చర్ ను పరిచయం చేసిన ఈ మ్యూజిక్ సెన్సేషన్ దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో పాట పాడారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ చిత్రంలో గోదారి గట్టు మీద పాటతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తన గొంతులోని మ్యాజిక్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను మైమరిపించారు. ఈ పాటతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రమణ గోగుల ఇప్పుడు మరో సాంగ్ తో మన ముందుకొచ్చారు.
గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే
మహాశివరాత్రి కానుకగా ‘నారి – ది విమెన్ (Naari The Women)’ అనే చిత్రంలో నుంచి రమణ గోగుల పాడిన ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే’ సాంగ్ (Na Gunde Lona Lyrical Song) ను మేకర్స్ బుధవారం రోజున రిలీజ్ చేశారు. ఈ పాట యూట్యూబ్ లో ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘నా గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే.. నువ్వే లేని నా మనసే ఆగనన్నదే.. నువ్వే వచ్చి వెళ్లావని తెలుసుకుంటినే.. వయ్యారాలు.. నీ వయ్యారాలు వలకబోస్తూ అట్టా ఎళ్లకే’ అంటూ సాగిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతోంది. రమణ గోగుల ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు ఈ పాటపై కామెంట్లు చేస్తున్నారు.
మార్చి 7న రిలీజ్
ఇక నారి సినిమా సంగతికి వస్తే.. మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13-20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే వివిధ అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరెక్కించారు. ఆమని, వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. శశి వంటిపల్లి నిర్మించిన ఆ సినిమా.. మార్చి 7వ తేదీన విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘ఈడు మగాడేంట్రా బుజ్జి..’, ‘నిశిలో శశిలా..’ పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.






