
ఈ ఏడాది ఏప్రిల్ 6న శ్రీరామనవమి(Sri Ramanavami) రోజున జరిగే భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి మీరు వెళ్లలేకపోతున్నారా? మీకు సీతారాముల కళ్యాణం తలంబ్రాలు కావాలనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. తాజాగా రాములోరి భక్తులకు TGSRTC ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar) శుభవార్త అందించారు. పవిత్ర భద్రాద్రి సీతారాముల కళ్యాణం తలంబ్రాలను మీ ఇంటికే పంపించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ కార్గో(RTC Cargo) ద్వారా తలంబ్రాల(Talumbras)ను మీ ఇంటికి తీసుకొస్తామని తెలిపారు. అయితే అందుకు మీరు చేయాల్సిందల్లా రూ.151 రూపాయి చెల్లించి ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
శ్రీ రామనవమికి భద్రాచల సీతారాముల కల్యాణ మహోత్సవానికి వెళ్లలేకపోతున్నారా? మీకు పరమ పవితమైన రాములోరి తలంబ్రాలు కావాలా? ఐతే మీకు #TGSRTC మంచి అవకాశం కల్పిస్తోంది. లాజిస్టిక్స్ విభాగం ద్వారా తలంబ్రాలను మీ ఇంటికే తీసుకొస్తుంది.
మీరు చేయాల్సిందల్ల ఇప్పుడే బుకింగ్ చేసుకోవడమే.… pic.twitter.com/oql1tIErOC
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 25, 2025
ఏప్రిల్ 6న భద్రాద్రిలో రాములవారి కళ్యాణం
కాగా ఏప్రిల్ 6వ తేదీన భద్రాద్రిలో రాములవారి కళ్యాణం వైభవంగా జరగనుంది. గత ఏడాది కూడా భక్తులకు తలంబ్రాలను ఇంటికి చేరవేసింది. దేవదాయ శాఖ(Endoment Department) సహకారంతో స్వామివారి కళ్యాణ తలంబ్రాలను ఈసారి కూడా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చే కార్యక్రమానికి TGSRTC శ్రీకారం చుట్టింది. కాగా ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్(tgsrtclogistics.co.in) ద్వారా కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. కాల్ సెంటర్ నెంబర్లు 040-69440069, 040-69440000లను సంప్రదిస్తే టీజీఎస్ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు ఆర్డర్లను స్వీకరిస్తారని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.