
తెలంగాణ(Telangana)లో మరోసారి బర్డ్ ఫ్లూ(Bird Flu) కలకలం రేపింది. ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృత్యువాత(death of chickens) పడిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ ధరలు(Chicken Rates) భారీగా పడిపోయాయి. తాజాగా నల్లగొండ(Nalgonda) జిల్లాలో బర్డ్ ఫ్లూ అలజడి రేగింది. చిట్యాల (M) గుండ్రాంపల్లి వద్ద గల కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. దాదాపు రెండు లక్షల కోళ్లు ఉన్నట్లుగా సమాచారం. అందులో కొన్నింటికి బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు(Officials) నిర్ధారించారు.
యాదాద్రి జిల్లాలో 30 వేల కోళ్ల మృత్యువాత
ఇదిలా ఉండగా యాదాద్రి(Yadadri) జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసు(Bird Flu Case) నమోదైంది. ఫామ్‌లోని సుమారు 30 వేల కోళ్లను అధికారులు చంపి పాతిపెట్టారు. పరిసర ప్రాంతాలను రెడ్ జోన్(Red Zone)గా అధికారులు ప్రకటించారు. కాగా నెలరోజుల క్రితం చౌటుప్పల్ మండలం నేలపట్లలో తెలంగాణలోనే తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైన విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులకు తగిన సూచనలిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.