
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కలిసి నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’కు (Rana Naidu)కు కొనసాగింపుగా (Rana Naidu Season 2) రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) జూన్ 13 విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సీజన్2 ట్రైలర్‌ను విడుదల చేసింది. తన కుటుంబం కోసం దేనికైనా తెగించే వ్యక్తిగా వెంకటేశ్ కనిపించనున్నారు. అయితే, పార్ట్ 1లో కాస్త బోల్డ్ కంటెంట్ ఉందని విమర్శలు రావడంతో సీక్వెల్ దానిని కాస్త తగ్గించారు. ప్రస్తుతం ట్రైలర్ లోనూ అలాంటి సీన్స్ లేవు.
కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి కర్బంద, అభిషేక్ బెనర్జీ, డినోమోరియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జూన్ 13 నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే మొదటి సిరీస్‌ను ఎక్కువ మంది వీక్షించినా బోల్డ్ కంటెంట్ కారణంగా విమర్శలు కూడా వచ్చాయి. కానీ చాలా మంది యువతకు ఈ సిరీస్ నచ్చింది. అందుకే పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు.