యుగాలు, తరాలు మారినా.. రామాయణ(Ramayana) కథ మాత్రం నిత్య నూతనం. ఈ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు తెరపై చూపించినా అందులో కొత్తదనాన్ని వెతుక్కొని మరీ ఆస్వాదిస్తుంటారు ప్రేక్షకులు. ఇక స్టోరీని బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ(Director Nitesh Tiwari) కాస్త కొత్తగా తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రంలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సాయిపల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ తాజాగా రెండు పార్టులుగా తీయబోతున్నట్లు డైరెక్టర్ అధికారికంగా ప్రకటించారు. దీనిని 2026లో దీపావళి పండక్కి రిలీజ్ చేయనున్నట్లు అల్రెడీ మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు తొలి పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు బీటౌన్‌లో చర్చ నడుస్తోంది.

సాయిపల్లవిపై కీలక సన్నివేశాలు షూట్
ఇక లేటెస్ట్‌గా పార్ట్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్(Bollywood) వర్గాల ప్రకారం మేకర్స్ పార్ట్ 2 షూటింగ్(Part-2 Shooting)ని కూడా ప్రారంభించారట. ప్రస్తుతం సాయి పల్లవిపై లంకలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే రణబీర్ సింగ్‌పై సన్నివేశాలని తెరకెక్కించనున్నారట. దీంతో అనుకున్న టైం కంటే ముందే ఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామాయణ రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ మూవీలో ఈ చిత్రంలో రావణుడిగా యశ్(Yash), హనుమంతుడిగా సన్నీ డియోల్(Sunny Deol) కనిపించనున్నారు. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్(Allu Aravnd) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.







