టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలతో పాటు థియేటర్ బిజినెస్‌లోనూ అడుగుపెడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు(Mahesh Babu) (ఏఎంబీ)(AMB), అల్లు అర్జున్(Allu Arjun) (ఏఏఏ)(AAA) అలాగే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) (ఏవీడీ)(AVD) మల్టీప్లెక్స్( Multiplex)లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మాస్ మహరాజా రవితేజ కూడా అదే బాటలోకి వెళ్లారు.
హైదరాబాద్(Hydarabad) శివారులోని వనస్థలిపురం(Vanasthalipuram)లో రవితేజ(Ravi Teja), ఏసియన్(Asian) సంస్థ కలసి నిర్మిస్తున్న మల్టీప్లెక్స్(Multiplex) నిర్మాణం దాదాపు పూర్తయింది. ‘ఏఆర్ టీ మల్టీప్లెక్స్'( ‘ART’ Multiplex)గా పేరుపొందబోయే ఈ థియేటర్ ప్రస్తుతం ఇంటీరియర్ పనులతో చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్‌కు సిద్ధమవుతోంది.
ఇక ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)తో ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం (July 24)జూలై 24న విడుదల కాబోతున్న నేపథ్యంలో, అదే రోజున థియేటర్ ప్రారంభం జరిగే అవకాశాలున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
View this post on Instagram
ఈ మల్టీప్లెక్స్‌ను అత్యాధునిక సాంకేతికత(Ultra-Modern Multiplex )తో తీర్చిదిద్దారు. సుమారు 57 అడుగుల వెడల్పు కలిగిన భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, టిక్ ఎక్స్‌పీరియన్స్ వంటి ఫీచర్లు ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఇప్పటికే పలు సార్లు టెస్టింగ్ పూర్తయిందని సమాచారం. త్వరలో టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది.






