SPIRIT: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ‘స్పిరిట్’ షూటింగ్ మళ్లీ పోస్ట్‌పోన్!

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy Vanga) కాంబోలో ‘స్పిరిట్‌(Spirit)’ మూవీని ప్రకటించి రెండేళ్లకు పైగానే అయింది. ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. గత ఏడాది నుంచి స్క్రిప్ట్‌ వర్క్(Srcipt Work) జరుగుతుందని, డైలాగ్‌ వర్షన్ స్క్రిప్ట్‌ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌(Animal)’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీతో పాటు సౌత్‌ ఇండియాలోనూ యానిమల్‌ సినిమాకు మంచి వసూళ్లు వచ్చిన విషయం తెల్సిందే. అందుకే అన్ని భాషల ప్రేక్షకులు కూడా ప్రభాస్‌తో సందీప్ వంగ తెరకెక్కించబోతున్న’స్పిరిట్‌’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా ఆలస్యం అవుతూ వస్తుంది.

Prabhas 25 SPIRIT Movie | Sandeep Reddy Vanga | Telugu TONIC - YouTube

కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్న ప్రభాస్

ఇటీవల దర్శకుడు సందీప్ వంగ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూన్‌ లేదా జులై నెలల్లో సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘స్పిరిట్‌(Spirit)’ సినిమాను ఇదే ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నుంచి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ప్రభాస్ ఫిజికల్‌గా రెడీ అవ్వాల్సి ఉందట. అందుకే షూటింగ్ ప్రారంభంకు కాస్త సమయం కావాలని అడిగారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్పిరిట్‌ సినిమా కోసం ప్రభాస్ కొత్త లుక్‌ను ట్రై చేస్తున్నాడని, అందుకే షూటింగ్‌కు ముందు కనీసం కొన్ని నెలలు ప్రిపరేషన్‌ జరగాలని అనుకుంటున్నారు.

Prabhas's Spirit is a police story: Director Sandeep Reddy Vanga

భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా

యానిమల్ సినిమాను చూసిన ప్రేక్షకులు ప్రభాస్‌ను స్పిరిట్‌ సినిమాలో ఎలా చూడబోతున్నామా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌(A huge action entertainer)గా పోలీస్‌ స్టోరీతో స్పిరిట్ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు సందీప్ వంగ ఆఫ్ ది రికార్డ్‌ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయితేనే స్పిరిట్ సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉంటాయి అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ప్రస్తుతం చేస్తున్న సినిమాల కంటే ప్రభాస్‌ ఇంకా మొదలు పెట్టని స్పిరిట్‌ సినిమాపైనే అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా 2026లో స్పిరిట్‌ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *