
‘లవ్ టుడే (Love Today)’తో సినిమాతో తొలి ప్రయత్నంలోనే అందరిని ఆకట్టుకున్నాడు తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఆ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. ఇక తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (return of the dragon). అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
డ్రాగన్ వచ్చేస్తోంది
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ కొన్ని రోజులుగా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మార్చి 21 నుంచి ఓటీటీలో
మార్చి 21వ తేదీ నుంచి ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon Ott)’ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్నట్లు సదరు సంస్థ తెలిపింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో కలిసి జాలీగా ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. ఇక ఈ చిత్రంలో నటించిన కయదు లోహల్ ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటోంది.
ప్రదీప్ చేతిలో 2 తెలుగు సినిమాలు
మరోవైపు ప్రదీప్ రంగనాథన్ కు కూడా తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. ఈ హీరో ఇప్పటికే తెలుగులో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ పాపులారిటీతో టాలీవుడ్ నిర్మాతలు ప్రదీప్ రంగనాథన్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారట. తెలుగులో ప్రదీప్.. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) తో ఓ సినిమా చేయనున్నారట. అంతే కాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా ఓ చిత్రం చేయనున్నట్లు న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.