Jallikattu: చంద్రగిరిలో జల్లికట్టు వేడుక.. స్పెషల్ అట్రాక్షన్‌గా హీరో మంచు మనోజ్

తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకల(Jallikattu celebrations)కు సినీ నటుడు, టాలీవుడ్ రాక్‌ స్టార్ మంచు మనోజ్(Manchu Manoj) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్‌కు TDP, జనసేన, NTR అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి గజమాలతో మనోజ్‌ను ఆహ్వానించారు. అంగరంగ వైభవంగా మొదలైన ఈ జల్లికట్టు వేడుకలలో పశువులను అందంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకలకు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరవడంతో.. యూత్(Youth) అంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొని, గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.

పార్టీలు, కులమతాలకు అతీతంగా జరపడం గొప్పవిషయం: మనోజ్

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘‘బ్రిటీష్ కాలం నుంచి ‘జల్లికట్టు(Jallikattu)’ పండుగ జరుగుతూనే ఉంది. సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత 20సంవత్సరాలుగా ఈ చంద్రగిరి నియోజకవర్గం(Chandragiri Constituency)లో నిర్వహించడం చాలా గొప్ప విషయం. తమిళనాడు ‘జల్లికట్టు’తో పోల్చుకుంటే ఇక్కడ అంత సివియర్‌గా ఉండదు. ఇక్కడ అంతా సాప్ట్‌గా ఉంటుంది. పశువుల పండగ‌గా చాలా భక్తితో జరుపుకుంటాం. పశువులపై హింసాత్మకంగా ప్రవర్తించకుండా, ముందుగా ఆలోచించుకుని ఇక్కడ ఈ వేడుకను జరుపుతుంటారు. దీనిని ప్రజలంతా ఎంతో ఆనందకరంగా పార్టీలకు, కులమతాలకు అతీతంగా నిర్వహించడం గొప్ప విషయం. పోలీసులు లా అండ్ అర్డర్ విషయంలో చాలా కేరింగ్‌గా ఉన్నారు. యువకులంతా పోలీసులకు సహకరిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను.’’ అని అన్నారు. తనకు గ్రాండ్ వెల్‌కమ్ పలికిన టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మంచు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *