
టీమ్ఇండియా(Team India) వెటరన్ ప్లేయర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టెస్ట్ క్రికెట్ నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్లు(Retirement) సంచలన ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(SM) ద్వారా వెల్లడించాడు. అయితే, ODI ఫార్మాట్‌లో భారత జట్టుకు తన సేవలు కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. ఈ నిర్ణయంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో హిట్ మ్యాన్ 11 ఏళ్ల కెరీర్‌కు తెరపడింది.
మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు
రోహిత్ శర్మ(Rohit Sharma) తన టెస్ట్ క్రికెట్(Test Cricket) ప్రస్థానంలో మొత్తం 67 మ్యాచ్‌లు ఆడాడు. 2022లో విరాట్ కోహ్లీ(Virat Kohli) నుంచి టెస్ట్ కెప్టెన్సీ(Test Captancy) బాధ్యతలు చేపట్టిన రోహిత్, 24 మ్యాచ్‌లలో జట్టును నడిపించాడు. తన కెరీర్‌లో మొత్తం 4,301 పరుగులు సాధించిన రోహిత్, ఇందులో 12 శతకాలు నమోదు చేశాడు. “హలో ఎవ్రీ వన్… నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. సుదీర్ఘ ఫార్మాట్‌లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇన్నేళ్లుగా మీరు చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. ఇకపై నేను వన్డే ఫార్మాట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాను” అని రోహిత్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
This legend will not see again in the test cricket 🏏 . He announced retirement to the test and continue odi only.
Thanks sir ! Great honour #RohitSharma #BCCI pic.twitter.com/PuHlQOGugY— Bitto Yadav (@BittoYadav4) May 7, 2025
రోహిత్ నాయకత్వంలో 12 విజయాలు, 9 ఓటములు
భారత జట్టు త్వరలో ఇంగ్లండ్(England)లో 5 టెస్టుల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో రోహిత్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జట్టు ఎంపిక త్వరలో జరగనుండగా, ఇప్పుడు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కొన్ని నెలల కిందట ఆస్ట్రేలియా పర్యటన(Australia Tour)లో టెస్ట్ కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్, తన పేలవమైన ఫామ్ కారణంగా ఒక దశలో జట్టు నుంచి కూడా తప్పుకున్నారు. ఆ సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కోల్పోయింది. అంతకుముందు న్యూజిలాండ్(New Zealand) చేతిలో రోహిత్ కెప్టెన్సీలోనే భారత్ 0-3 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. గత 12 ఏళ్లలో స్వదేశంలో భారత్ సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. రోహిత్ నాయకత్వంలో భారత్ మొత్తం మీద 12 విజయాలు సాధించి, 9 ఓటములు చవిచూసింది.