
మరికొన్ని రోజుల్లో మినీ వరల్డ్ కప్‌గా భావించే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19నుంచి పాకిస్థాన్(Pakistan), UAE వేదికగా ఈ మినీ సంగ్రామం మొదలు కానుంది. ఇప్పటికే భారత్(Team Indai) మినహా దాదాపు అన్ని జట్లు తమతమ టీమ్‌లను ప్రకటించాయి. భారత్ ప్లేయర్లు గాయాల బారిన పడటంతో BCCI జట్టు ఎంపికకు మరోవారం గడువు ఇవ్వాలని కోరడంతో ICC అనుమతించింది. దీంతో ఈ ఆదివారం (జనవరి 19)లోపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ(BCCI Selection Committee) భారత్ జట్టును ప్రకటించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా దాదాపు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో భారత్ పర్యటించాల్సి ఉండగా.. 2008లో పాక్ ఉగ్రవాదులు ముంబైపై దాడికి పాల్పడటంతో అప్పటి నుంచి అక్కడ మన జట్టు మ్యాచులు ఆడటం లేదు.
ఓపెనింగ్ వేడుకల్లో కెప్టెన్ పాల్గొనాల్సిందేనా..
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అక్కడే జరగనుంది. అయినా భారత్ ఆ దేశంలో పర్యటించేది లేదని స్పష్టం చేసింది. దీంతో ప్రత్యామ్నాయంగా ICC భారత్ ఆడే మ్యాచులను UAEకి తరలించింది. ఫలితంగా మనం పాక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma) మాత్రం పాకిస్థాన్‌కి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఐసీసీ నిర్వహించే ఏ మెగా టోర్నీకి అయినా అందులో ఆడే కెప్టెన్లు అందురూ ఓపెనింగ్ వేడుకల్లో(Opening Ceremony) పాల్గొనాల్సి ఉంటుంది.
చాలా ఏళ్ల తర్వాత పాక్‌లో ఐసీసీ ఈవెంట్
ఈ కారణంతో హిట్ మ్యాన్(Hitman) పాక్‌లో టోర్నీ ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. అంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత ఓ భారత క్రికెటర్ పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టబోతున్నాడన్న మాట. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. అంటే… ఫిబ్రవరి 17 గాని, లేదంటే 18న గాని ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. చాలా ఏళ్ల తర్వాత పాక్ లో ఐసీసీ మెగా ఈవెంట్(ICC Mega Event) జరుగుతున్ననేపథ్యంలో ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు(PCB) భావిస్తోంది.