War2: వార్-2 నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. బికినీ లుక్‌లో అదరగొట్టిన కియారా!

బాలీవుడ్‌లో ప్రస్తుతం హైప్ క్రియేట్ చేస్తున్న మూవీ ‘వార్ 2’(War 2). ఈ సినిమాలో ఎన్టీఆర్‌(NTR), హృతిక్ రోషన్(hrithik roshan) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, ఆగస్టు 14న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. కాగా అభిమానులకు మేకర్స్ ఒక భారీ సర్ప్రైజ్‌ అందించారు. నేడు కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం ‘ఊపిరి ఊయలాగా’ అనే ఓ రొమాంటిక్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది.

ఈ సాంగ్‌లో కియారా అద్వానీ బికినీ లుక్ ప్రేక్షకులను షాక్ కి గురిచేసింది. పాన్ ఇండియా స్థాయిలో ఆమె మొదటిసారి ఈ విధంగా బోల్డ్ లుక్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఆమె ఈ సాంగ్ లో కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేసేసింది.

ఈ సాంగ్‌ను హిందీ వెర్షన్‌లో ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ రాయగా, అర్జిత్ సింగ్, నిఖితా గాంధీ స్వరాలు అందించారు. సంగీతాన్ని ప్రీతమ్ అందించగా, ఇది చాలా రొమాంటిక్‌ ఫీలింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. గతంలో ఇదే కాంబినేషన్ ‘బ్రహ్మాస్త్ర’ మూవీలో ‘కేసరియా’ సాంగ్‌తో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సినిమా విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌ బాగా వైరల్ అవుతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *