విశ్వంభర సాంగ్ లీక్.. బ్రహ్మాస్త్ర బ్యూటీ లీక్ చేసేసిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న భారీ బడ్జెట్‌ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’(Vishwambhara ) అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్‌ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. చివరి షెడ్యూల్‌లో ఓ ప్రత్యేక సాంగ్ ను చిత్రీకరించగా, ఇందులో చిరంజీవితో కలిసి చిందులేయనున్న నటి ఎవరనేది మేకర్స్ రివీల్ చేయలేదు.

అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్(Mouni Roi) స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ లో చిరంజీవితో కలిసి చేసిన స్పెషల్ సాంగ్ గురించి పోస్ట్ చేస్తూ.. “లెజెండరీ యాక్టర్ చిరంజీవి సార్ పక్కన డ్యాన్స్ చేయడం గర్వంగా ఉంది. ఈ అద్భుత అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను,” అని పేర్కొన్నారు. అలాగే షూటింగ్ సందర్భంగా తీసిన ఫోటోలు, రిహార్సల్స్ వీడియోలు కూడా ఆమె షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్ తర్వాత కొద్దిసేపటికే మౌని రాయ్ దాన్ని డిలీట్ చేయడంతో, నెట్టింట వైరల్ అయిన ఈ విషయాన్ని దాచడం మేకర్స్‌కు కుదర్లేదు. అధికారికంగా ప్రకటించేశారు.

Mouni Roy Wraps Up Special Song in Chiranjeevi's Vishwambhara | Filmfare.com

ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, సౌరవ్ లోకేష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందించగా, స్పెషల్ సాంగ్‌కి మాత్రం భీమ్స్‌ సిసిరోలియో ట్యూన్ కంపోజ్ చేశారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *