AA22xA6: ఒక్క మూవీ చేయకుండానే.. అల్లు-అట్లీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేశాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషన్ డైరెక్టర్ అట్లీ కాంబోలో హాలివుడ్(Hollywood) రేంజ్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో VFXకు ప్రాధాన్యత ఉన్నట్లుగా తెలుస్తోంది. పైగా ALLU-ATLY ఇటీవల USAలోని ప్రముఖ lola VFX ఆఫీస్‌ను సందర్శించడంతో ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇండియా నుంచి కల్కి, GOAT, ఇండియన్-3, హాలీవుడ్‌లో కెప్టెన్ అమెరికా, హ్యారీ పోటర్, Avengers: Endgame వంటి చిత్రాలకు ఈ సంస్థ పనిచేసింది. దీంతో అల్లు అర్జున్(Allu Arjun) ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఈ మూవీకి మ్యూజిక్‌ డైరెక్టర్‌(Music Director)పై మరో అప్డేట్ వచ్చినట్లు సమాచారం.

చార్ట్ బస్టర్స్‌గా ప్రైవేటు సాంగ్స్

హాలివుడ్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్(Sai Abhyankar) ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫీషియల్‌గా ప్రకటన రానప్పటికీ దాదాపు ఖరారైనట్లు టీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. 20 ఏళ్ల సాయి అభ్యంకర్ ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ కొన్ని ప్రైవేటు సాంగ్స్(Private Songs) చేశాడు. అవన్నీ కూడా చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.

టిప్పు-హరిణి దంపతుల పుత్రుడే..

ఇప్పటి వరకు రాక్ స్టార్ అనిరుధ్(Anirudh) వద్ద అడిషనల్ ప్రోగ్రామర్‌గా సాయి అభ్యంకర్ పనిచేశాడు. దేవత, కూలీ(Cooli) లాంటి సినిమాలకు అడిషనల్ ప్రోగ్రామర్‌గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి ఈ 20 ఏళ్ల మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడనే వార్తలు రావడంతో ఇతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. కాగా దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం ప్లే బ్యాక్ సింగర్స్‌గా సంగీత ప్రపంచాన్ని ఏలిన టిప్పు-హరిణి(Tipu-Harini) దంపతుల పుత్తుడే సాయి అభ్యంకర్. మ్యూజిక్‌పై ఉన్న ఆసక్తితో అనిరుధ్ వద్ద పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *