
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషన్ డైరెక్టర్ అట్లీ కాంబోలో హాలివుడ్(Hollywood) రేంజ్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో VFXకు ప్రాధాన్యత ఉన్నట్లుగా తెలుస్తోంది. పైగా ALLU-ATLY ఇటీవల USAలోని ప్రముఖ lola VFX ఆఫీస్‌ను సందర్శించడంతో ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇండియా నుంచి కల్కి, GOAT, ఇండియన్-3, హాలీవుడ్‌లో కెప్టెన్ అమెరికా, హ్యారీ పోటర్, Avengers: Endgame వంటి చిత్రాలకు ఈ సంస్థ పనిచేసింది. దీంతో అల్లు అర్జున్(Allu Arjun) ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్(Music Director)పై మరో అప్డేట్ వచ్చినట్లు సమాచారం.
Gear up for the Landmark Cinematic Event⚡✨#AA22xA6 – A Magnum Opus from Sun Pictures💥@alluarjun @Atlee_dir #SunPictures #AA22 #A6 pic.twitter.com/MUD2hVXYDP
— Sun Pictures (@sunpictures) April 8, 2025
చార్ట్ బస్టర్స్‌గా ప్రైవేటు సాంగ్స్
హాలివుడ్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్(Sai Abhyankar) ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫీషియల్‌గా ప్రకటన రానప్పటికీ దాదాపు ఖరారైనట్లు టీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. 20 ఏళ్ల సాయి అభ్యంకర్ ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ కొన్ని ప్రైవేటు సాంగ్స్(Private Songs) చేశాడు. అవన్నీ కూడా చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.
Special appreciation post for @SaiAbhyankkar 🔥💥 The youngest music director ever to handle a magnum opus project like #AA22xA6 🥵
Not even his debut album has released, but he has committed more than 5 films📈🤯
SENSATIONAL SAI ABHYANKAR 👌🏻💣.#AlluArjun | #AA22 | #Atlee pic.twitter.com/UhibTavaJT
— Parthaaaa (@Parthaaaa6969) April 8, 2025
టిప్పు-హరిణి దంపతుల పుత్రుడే..
ఇప్పటి వరకు రాక్ స్టార్ అనిరుధ్(Anirudh) వద్ద అడిషనల్ ప్రోగ్రామర్‌గా సాయి అభ్యంకర్ పనిచేశాడు. దేవత, కూలీ(Cooli) లాంటి సినిమాలకు అడిషనల్ ప్రోగ్రామర్‌గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి ఈ 20 ఏళ్ల మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడనే వార్తలు రావడంతో ఇతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. కాగా దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం ప్లే బ్యాక్ సింగర్స్‌గా సంగీత ప్రపంచాన్ని ఏలిన టిప్పు-హరిణి(Tipu-Harini) దంపతుల పుత్తుడే సాయి అభ్యంకర్. మ్యూజిక్‌పై ఉన్న ఆసక్తితో అనిరుధ్ వద్ద పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.