
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నుంచి దాదాపు రెండేళ్లుగా ఒక్క సినిమా రాలేదు. గతంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో అలరించింది. ఆ తర్వాత ఓ రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పినా వాటి నుంచి అప్డేట్స్ లేవు. అయినా నిత్యం ఈ భామ లైమ్ లైటులోనే ఉంటోంది. తాజాగా ఈ బ్యూటీ చెన్నై వేదికగా జరిగిన బిహైండ్‌వుడ్స్ అవార్డుల (Behind Woods Awards 2025) వేడుకలో పాల్గొంది. ఇందులో భాగంగా 2010 నుంచి స్ఫూర్తిదాయక పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నందుకు ఆమెను కె.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు వరించింది.
View this post on Instagram
చాలా ఆనందంగా ఉంది
ఈ అవార్డు (K Balachandar Hall Of Fame Award) అందుకున్న అనంతరం సమంత చాలా ఎమోషనల్ అయింది. రెండేళ్ల నుంచి తన నుంచి ఒక్క తమిళ సినిమా లేకపోయినా తనపై ఎంతో అభిమానం చూపిస్తున్నారంటూ కంటతడి పెట్టింది. కె.బాలచందర్ సర్ పేరుతో ఈ అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పుకొచ్చింది. ఆయన సినిమాల్లో ఫీమేల్ లీడ్సా చాలా సహజంగా ఉంటాయని.. ఈ అవార్డు పొందటంతో తన జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోందని హర్షం వ్యక్తం చేసింది.
View this post on Instagram
మీరు లేక నేను లేను
“సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే మనల్ని ప్రేక్షకులు మనల్ని ప్రేమించడం కామన్. కానీ నా నుంచి సినిమా వచ్చి రెండేళ్లయింది. రెండేళ్ల నుంచి నేను ఒక్క తమిళ సినిమా చేయలేదు. ఈ మధ్య కాలంలో అసలు నేను హిట్ కూడా చూడలేదు. అయినా నాపై మీ ప్రేమ మాత్రం తగ్గలేదు. ఈ అభిమానాన్ని చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. మీ అందరి నుంచి ఇంత ప్రేమను పొందడానికి నేనేం చేశానో కూడా నాకు తెలియడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మీరు లేకుండా నేను లేను.” అని చెబుతూ సామ్ (Samantha Emotional) ఎమోషనల్ అయింది.
మరో రెండు కొత్త ప్రాజెక్టులు
ఇక ఇటీవల ‘సిటడెల్ హనీ బన్నీ (Citadel Honey Bunny)’తో ప్రేక్షకులను అలరించిన సామ్ ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే మరో సిరీస్ లో నటిస్తోంది. ఇక తన సొంత ప్రొడక్షన్ లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తోంది. ఇక ఈ భామ నిర్మాతగా రూపొందించిన సినిమా శుభం త్వరలోనే రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకేలో రాజ్(Sam Raj Love Story) తో ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా ఫేక్ అని సామ్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.