Mana Enadu : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన సిటడెల్ హనీ-బన్నీ (Citadel Honey Bunny) ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో సామ్, వరుణ్ తమ యాక్షన్ తో అదరగొట్టారు. ముఖ్యంగా సమంత యాక్షన్ సీక్వెన్సుల్లో తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఇక తన హిందీ డబ్బింగ్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న ఈ ట్రైలర్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో
ది ఫ్యామిలీ మ్యాన్ ఫేం రాజ్ అండ్ డీకే (Raj And DK) ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ నవంబరు 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ (Citadel Trailer)లో సిమ్రన్, కేకే మేనన్, సోహమ్ మజుందార్ కీలక పాత్రల్లో నటించారు.
ప్రియాంకా పాత్రకు తల్లిగా సామ్
ఇక సిటడెల్ హాలీవుడ్లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) చేసిన పాత్రను ఇక్కడ సమంత పోషించింది. అయితే హాలీవుడ్ సిటడెల్ లో ప్రియాంకా పాత్ర పేరు నాడియా.. ఇక ఇండియన్ సిటడెల్ వెర్షన్ లో సమంత కూతురు పాత్ర పేరు కూడా నాడియా. దీన్ని బట్టి ప్రియాంక పాత్రకు తల్లిగా సమంత సిటడెల్ లో నటిస్తోందని ప్రేక్షకులు అంటున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్-2, యశోద సినిమా తర్వాత సామ్ ఈ సిరీస్లో యాక్షన్ పాత్రలో సందడి చేసింది.
సిటడెల్ తో అయినా సామ్ దశ తిరిగేనా
యశోద, శాకుంతలం (Shaakuntalam), ఖుషి.. ఇలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమంత దాదాపు రెండేళ్లుగా సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత సమంత నుంచి వస్తున్న సిరీస్ సిటడెల్. ఈ సిరీస్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక సమంత మళ్లీ తన స్టార్ డమ్ ను.. ఈ సిరీస్ తో తిరిగి పొందనుందని సినీ వర్గాల్లో టాక్. మరి ఎంతో అలరిస్తున్న సిటడెల్ – హనీ బన్నీ (Samantha Citadel) ట్రైలర్ ను మీరూ చూసేయండి.