
మొబైల్ ఫోన్.. ప్రస్తుత టెక్ యుగం(Smartphone Market)లో దాని వ్యాల్యూ ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా నిత్యం మార్కెట్లోకి వందలాది కంపెనీలు లాంచ్ అవుతున్నాయి. కానీ ఎన్ని కొత్త బ్రాండ్(New Brands) కంపెనీలు వచ్చినా.. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత కలిగిన కొన్ని బ్రాండ్లు ఎప్పటికీ తమదైన ముద్ర వేస్తుంటాయి. ఆ కోవలోకి చెందినవే శామ్‌సంగ్(Samsung), ఐఫోన్, ఓప్పో, వివో, జియో, షియోమీ, మోటరోలా మొదలైనవి. వినియోగదారులకు ఎప్పటి నుంచో సేవలు అందిస్తోన్న శామ్‌సంగ్ టెక్ యుగంలో తనదైన ముద్రవేసింది. అయితే తాజాగా ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(International Data Corporation) ప్రకటించిన నివేదికలో శామ్‌సంగ్ బ్రాండ్ వ్యాల్యూ పడిపోయింది.
తాజా నివేదిక(Report 2024) ప్రకారం 2024లో మొబైల్ కంపెనీలకు సంబంధించి శామ్‌సంగ్ తన మార్కెట్ వాటాలో 4 శాతం కోల్పోయింది. ఈ సౌత్ కొరియా కంపెనీ వాటా 17 నుంచి 13.2 శాతానికి పడిపోయి రెండో స్థానంలో నిలిచింది. వివో(Chaina) 15.2 నుంచి 16.6 శాతానికి చేరి టాప్‌లో నిలిచినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(IDC) వెల్లడించింది. ఐఫోన్ మార్కెట్ 6.4 నుంచి 8.2 శాతానికి చేరినట్లు తెలిపింది.
టాప్-10లో ఉన్న కంపెనీలు ఇవే..
☛ వివో 16.6శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది.
☛ శాంసంగ్ 13.2%
☛ ఒప్పో 12%
☛ షియోమీ 12%
☛ రియల్ మీ 11%
☛ ఆపిల్ 8.2%
☛ మోటరోలా 6%
☛ పోకో 5.6%
☛ వన్ ప్లస్ 3.9%
☛ ఐక్యూ 3.3%
☛ ఇతర కంపెనీలు 8.2% మార్కెట్ వ్యాల్యూ కలిగి ఉన్నాయి.