
సినిమా తీయడం ఒకెత్తయితే.. ఆ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు చేసే ప్రమోషన్స్ మరొక ఎత్తు. మూవీ ఎంత బాగున్నా.. ఆ సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయకపోతే అంతే సంగతులు. ఇక ప్రచారంలో కొందరు డైరెక్టర్లు, హీరోలు, చిత్రబృందాలు సరికొత్త తెరలేపి వాళ్ల చిత్రాలకు విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇదే బాటలో వెళ్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan).
అన్షు రీ ఎంట్రీ
తెలుగు చిత్రపరిశ్రమలో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ నిత్యం ప్రేక్షకుల్లో ఉంటున్న హీరోల్లో ఒకడు సందీప్ కిషన్. తాజాగా తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మజాకా (Mazaka). ధమాకా ఫేం త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక మన్మథుడు ఫేం అన్షు (Anshu) ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
రాములమ్మ సాంగ్ లైవ్ షూట్ వీడియో
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం బిజీబిజీగా ఉంది. అయితే ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ కాస్త వెరైటీగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ నుంచి రాములమ్మ సాంగ్ లైవ్ ఫిల్మ్ షూట్ (Mazaka Movie Song Shooting Live) ఎలా ఉండబోతుందో చూపిస్తూ పాట షూట్‌కు సంబంధించిన ఫుల్ వీడియోను రిలీజ్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలిసారి ఇలాంటి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలి సినిమా ఇదే. ఈ మూవీని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…