
వరుస సినిమాలతో డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) సక్సెస్ జోష్ లో ఉన్నాడు. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్.. తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
చిరు-అనిల్ మూవీ అప్డేట్
షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ స్క్రిప్టింగ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో (bheems ceciroleo) ఈ సినిమా కోసం నాలుగు సాంగ్స్ సిద్ధం చేసినట్లుగా తెలిసింది. ఈ పాటలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని టాక్.
భీమ్స్ వాయిస్తే పాట హిట్టే
అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమాకు కూడా భీమ్స్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ లో భీమ్స్ పాటలు కూడా ఓ భాగమే. ఇక సాధారణంగానే మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మెగాస్టార్ డ్యాన్సుకు మామూలు క్రేజ్ లేదు. దీంతో ఈ సినిమా పాటలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఇక భీమ్స్ కూడా చిరు చిత్రానికి సూపర్ హిట్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం.