Video Viral : కూలిన ఆరు అంతస్తుల భవనం.. నలుగురు దుర్మరణం

ఢిల్లీలో మరో భవనం (Building Collapse) కుప్పకూలింది. ముస్తాఫాబాద్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆరు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడాయి.

నలుగుగురు మృతి

అయితే ఈ ఘటనలో నలుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. శిథిలాల కింద నుంచి ఇప్పటి వరకు 14 మందిని కాపాడినట్లు వెల్లడించారు. వెంటనే వారిని జీటీబీ ఆస్పత్రి(GTB Hospital in Delhi)కి తరలించగా అందులో నలుగురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని పేర్కొన్నారు. భవనం కూలిన సమయంలో శిథిలాల కింద 22 మంది చిక్కుకున్నట్లు తెలిసిందని.. ఇంకా 8 మంది వాటి కిందే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నట్లు వివరించారు.

సీసీటీవీ దృశ్యాలు వైరల్

శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్​డీఆర్​ఎఫ్ (NDRF), ఢిల్లీ పోలీసులు (Delhi Police) సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శనివారం  తెల్లవారుజామున 3 గంటల సమయంలో భవంతి కుప్పకూలిందని..  తమకు 3:02 గంటలకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. భవనం కూలుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే భవనం కూలడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *