Mana Enadu : అబుదబీ వేదికగా ‘ఐఫా’ (international Indian Film Academy) అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమకు చెందిన సినీ తారలు పాల్గొన్నారు. పలు భాషల్లో ప్రేక్షకులను మైమరిపించిన సినిమాలు, నటీనటులను ఐఫా పురస్కారం వరించింది.
ముఖ్యంగా హిందీలో యానిమల్, తెలుగులో దసరా చిత్రాలకు అవార్డుల పంట పండింది. ఇక ఈ వేడుకలో ‘జవాన్ (Jawan)’ చిత్రానికి ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్ (Sharukh Khan) అవార్డు అందుకున్నారు. దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేతుల మీదగా షారుక్ ఈ పురస్కారం అందుకున్నారు.
అనంతరం ఆయన చిత్రబృందానికి థాంక్యూ చెబుతూ.. ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ సినిమాకు పని చేసిన వారి నుంచి నేర్చుకున్నానని తెలిపారు. చాలా కాలం తర్వాత తాను వర్క్ చేసిన మూవీ ఇది అని.. చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడటం తనకు ఇష్టం లేకపోయినా (ఆర్యన్ ఖాన్ కేసు ఉద్దేశించి (Aryan Khan Case)) ఎన్నో ఒత్తిళ్ల మధ్య ఈ సినిమా కోసం వర్క్ చేశానని ఎమోషనల్ అయ్యారు.
ఇక ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్, కరణ్ జోహార్, విక్కీ కౌశల్ (Vicky Kaushal) వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా.. షారుక్ అవార్డు అందుకున్న తర్వాత ‘ఊ అంటావా మావ’ పాటకు షారుక్ – విక్కీ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్ (Samantha) కు గట్టి పోటీ ఇచ్చారు షారుక్ – విక్కీ అంటూ నెటిజన్లు అంటున్నారు. విక్కీ షారుక్ క్యూట్ పెయిర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Yeh tho asli FIRE hey
KING KHAN @iamsrk & @vickykaushal09 set the stage on FIRE pic.twitter.com/bpqUL40hgk
— Mythri Movie Makers (@MythriOfficial) September 28, 2024






