హీరోయిన్‌గా కెరీర్ కొనసాగిస్తూనే, భవిష్యత్‌ను సురక్షితంగా ప్లాన్ చేసుకోవాలని నమ్మే వారిలో బాలీవుడ్ హీరోయిన్స్ ముందుంటారు. తెలుగు సినీ తారలతో పోలిస్తే బాలీవుడ్ తారలు ఓ వైపు సినిమాలు చేస్తూ, మరోవైపు వ్యాపారాల్లోనూ స్థిరపడుతూ రెండుచేతుల సంపాదనలతో బిజీగా ఉంటున్నారు. అటువంటి వారిలో శిల్పా శెట్టి(Shilpa Shetty) ఒకరు. బిజినెస్(Business) విమెన్ గా నెలకు కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.
హీరోయిన్‌గా, వ్యాపారవేత్తగా
శిల్పా శెట్టి సినిమాల్లో ‘జీరో సైజ్’ ట్రెండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు పొందింది. తెలుగులో ‘సాహసవీరుడు సాగరకన్య’ చిత్రంలో నటించింది.ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఆమె పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైంది.
రెస్టారెంట్ బిజినెస్‌లో భారీ విజయాలు
స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే శిల్పా వ్యాపార రంగాన్ని అన్వేషించడంమొదలు పెట్టింది. 2019లో రంజిత్ బింద్రాతో కలిసి ముంబై బాంద్రాలో ‘బాస్టియన్’ అనే రెస్టారెంట్ బిజినెస్‌ను ప్రారంభించింది. ప్రారంభించిన కొద్దికాలంలోనే ఈ రెస్టారెంట్‌కు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు బాస్టియన్ నగరంలోని పలు ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా, పూణే, కలకత్తా, బెంగుళూరు, గోవా లాంటి నగరాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేసే పనిలో ఉంది.
నెలకు ₹6 కోట్లు ఆదాయం!
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, బాస్టియన్ రెస్టారెంట్ ద్వారా శిల్పా శెట్టికి నెలకు సుమారు రూ. 6 కోట్లు ఆదాయం వస్తోంది. ఈ రెస్టారెంట్ ముంబైలో అత్యధిక జీఎస్టీ కట్టే రెస్టారెంట్లలో ఒకటిగా నిలిచిందని ఆమె స్వయంగా చెప్పింది. ముంబైలోని స్టార్ సెలబ్రిటీలు ఈ రెస్టారెంట్‌కు తరచూ వచ్చే వారు కావడం వల్ల, బాస్టియన్‌కి బ్రాండ్ వాల్యూతో పాటు రెవెన్యూలోనూ పెరుగుదల వస్తోంది. అద్భుతమైన అంబియన్స్ కూడా ప్రధాన ఆకర్షణ. శిల్పా రెస్టారెంట్ బిజినెస్‌తో పాటు యోగా స్టూడియోలు కూడా నిర్వహిస్తోంది.






