డైరెక్టర్ RGVకి షాక్.. మరో కేసులో సీఐడీ నోటీసులు!

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ(Director Ramgopal Varma)ను వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఓ కేసుకు సంబంధించి ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌(Ongolu Rural Police Station)లో విచారణకు హాజరయ్యారు. తాజాగా వర్మపై మరో కేసు నమోదైంది. ఈసారి CID పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ నోటీసులు(Notice) కూడా ఇచ్చారు. 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో వర్మ తమ మనోభావాలు దెబ్బతీశాడంటూ తెలుగు రాష్ట్ర యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గుంటూరు CIDకి ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ నెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ RGVకి నోటీసులు అందించారు.

విచారణకు హాజరవుతారా? లేదా?

ఈ కేసులో వర్మ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. BNS సెక్షన్ల కింద వర్మపై కేసు నమోదైంది.
అటు.. కూటమి నేతలపై సోషల్ మీడియా పోస్టుల(Social media posts)కు సంబంధించిన కేసులో వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు వర్మపై ప్రశ్నల వర్షం కురిపించారు విచారణ అధికారి CI శ్రీకాంత్‌. గత YCP ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, నారా లోకేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి (X)లో పోస్ట్‌ చేశారు వర్మ. వ్యూహం సినిమా ప్రమోషన్స్(Vyuham Movie Promotions)లో భాగంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు వర్మ అంగీకరించినట్లు సమాచారం.

కాగా సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి వర్మపై TDP కార్యకర్త గతంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులు, కుటుంబసభ్యులపై రాంగోపాల్ వర్మ అనుచిత పోస్టులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మద్దిపాడు పోలీసులు RGVపై 7సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Related Posts

Hansika: బాంబే హైకోర్టును ఆశ్రయించిన హన్సిక.. ఎందుకో తెలుసా?

తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ హీరోయిన్ హన్సిక (Hansika) బాంబే హైకోర్టు(High Court of Bombay)ను ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం క్వాష్‌ పిటిషన్‌(Quash petition) దాఖలు చేసింది. తన సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె…

బెట్టింగ్ యాప్స్ ఇష్యూ.. వారిని అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా: KA పాల్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps Issue) వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల(Cine Celebrities)పై కేసు నమోదు కాగా.. నిన్న రామారావు అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రభాస్(Prabhas), గోపీచంద్‌పై ఫిర్యాదు చేశాడు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *