
మస్తాన్ సాయి(Mastan Sai), లావణ్య(Lavanya)ల మధ్య వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా AP గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Justice Abdul Nazeer)కు లావణ్య తరపు న్యాయవాది నాగూర్ బాబు(Nagur Babu) లేఖ రాశారు. అతడి వల్ల మస్తాన్ దర్గా(Mastan Dargah)కు అపవిత్రత కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. గుంటూరు(Guntur)లోని మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబ సభ్యులను తొలగించాలని లేఖలో కోరారు. ఈ లేఖను చీఫ్ సెక్రటరీ, గుంటూరు జిల్లా కలెక్టర్, మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు.
సినీ హీరో రాజ్ తరుణ్(Raj Tarun), లావణ్యల మధ్య నెలకొన్న వివాదం సినీ పరిశ్రమలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మస్తాన్ సాయి నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే మస్తాన్ సాయిపై మహిళల న్యూడ్ ఫొటోలు తీయడం, అత్యాచారం, డ్రగ్స్ ఇలా పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మస్తాన్ సాయి హైదరాబాద్ నార్సింగి పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది: మస్తాన్‌సాయి తల్లిదండ్రులు
ఇదిలా ఉండగా మస్తాన్‌సాయి తల్లిదండ్రులు(Mastansai’s parents) లావణ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్తాన్‌సాయి పేరెంట్స్ మాట్లాడుతూ.. “మా అబ్బాయికి పెళ్లి అయ్యినా కూడా లావణ్య మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అలాగే రూ.12 కోట్లు ఇవ్వాలని బెదిరించింది. మస్తాన్‌సాయి ఫోన్‌లో వందలమంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదు. అతని ఫోన్‌లో ఉన్న వీడియోలు అతని భార్యవే తప్ప, ఇంకెవరివీ లేవు. మా అబ్బాయి నిర్దోషి. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది” అని వారు పేర్కొన్నారు.