
ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం(Suicide Attempt) చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని నిజాంపేట్ హోలిస్టిక్ ఆసుపత్రి(Nizampet Holistic Hospital)లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె స్పృహలోకి రావడంతో పోలీసులు స్టేట్‌మెంట్(statement) రికార్డ్ చేస్తున్నారు. అయితే, కల్పనకు ప్రాణాపాయమేమీ లేదని, ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. మరోవైపు కల్పనను పరామర్శించడానికి టాలీవుడ్ ప్రముఖ సింగర్లు ఆస్పత్రికి తరలివస్తున్నారు.
కల్పనకు తోటి సింగర్ల పరామర్శ
ఇదిలా ఉండగా నిజాంపేట్ హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్పన ఆరోగ్య పరిస్థితిపై సింగర్ సునీత(Sunitha) స్పందించారు. ప్రస్తుతం ICUలో కల్పనకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని. త్వరలోనే కోలుకొని రోజువారీ జీవనం గడిపేలా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సునీతతోపాటు సింగర్లు కారుణ్య, శ్రీకృష్ణ, గీతామాధురి తదితరులు ఆస్పత్రికి వెళ్లి కల్పనను పరామర్శించారు. కాగా గతంలోనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని కల్పన ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.
మంగళవారం జరిగింది ఇది..
ఇదిలా ఉండగా సూసైడ్ అటెంప్ట్ వెనుక ఆమె రెండో భర్త ప్రసాద్(Husband Prasad) హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. మరోసారి కల్పన ఇంట్లో తనిఖీలు కూడా చేపట్టారు. మరోవైపు తాను పనిమీద రెండు రోజుల క్రితం చెన్నైకి వెళ్లినట్లు పోలీసులకు ప్రసాద్ తెలిపారు. కాగా ఆమె ఇంటి నుంచి రెండు రోజులుగా బయటకు రాకపోవడంతో అసోసియేషన్ సభ్యులు ఆమె ఫోన్‌కు కాల్ చేయగా, ఎలాంటి రెస్పాన్స్ లభించలేదు. దీంతో వారు కల్పన భర్తకు ఈ విషయాన్ని ఫోన్ చేసి వివరించగా.. ఆయన కూడా ఆమెకు ఫోన్ చేసే ప్రయత్నం చేశాడట. కానీ, ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆమె ఇంటి తలుపులు పగలకొట్టగా కల్పన స్పృహ తప్పి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Singer kalpana suicide
Police suspecting husband
Why she was all alone at home? Does nobody looking after her? @SingerKalpana #singerkalpanasuicide pic.twitter.com/Eh8khQoFmj— Petricia_Journalist (@GodlaPetricia) March 4, 2025