అప్పుడు అర్జీత్ సింగ్.. ఇప్పుడు శ్రేయా ఘోషల్.. ‘డాక్టర్ రేప్​’​పై సాంగ్

Mana Enadu : పశ్చిమ బెంగాల్‌ కోల్​కతాలోని ఆర్​జీ కార్ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం(Kolkata Doctor Rape Murder) జరిగిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఈ ఘటనపై బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ (Arjith Singh) బెంగాలీ పాటతో నిరసనలకు మద్దతు పలికారు.

దయచేసి చప్పట్లు కొట్టొద్దు

ఇక తాజాగా మరో గాయని శ్రేయా ఘోషల్‌ కూడా కోల్​కతా డాక్టర్ రేప్ ఘటనపై ఓ పాట పాడారు. ‘ఆల్‌ హార్ట్స్‌ టూర్‌(All Hearts Tour)’లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన కన్సర్ట్​లో శ్రేయా (Shreya Ghoshal) ఆర్జీ కర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనపై పాట పాడారు. ఆ సమయంలో ఈ పాట వింటూ దయచేసి చప్పట్లు కొట్టొద్దని శ్రోతలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఆ బాధే ఈ పాట

‘గాయపడిన నా శరీరం బాధను ఈ రోజు మీరు వింటున్నారు..’ అంటూ సాగే పాటను శ్రేయా చాలా ఎమోషనల్​గా పాడారు. ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎదుర్కొనే బాధ, వారి ఆవేదనను ఆమె ఈ పాట రూపంలో వినిపించారు. ఈ పాటకు ఎవరూ చప్పట్లు కొట్టొద్దని ఆడియన్స్‌ను ఆమె కోరారు. శ్రేయా పాట పాడడం పూర్తయ్యాక స్టేడియం మొత్తం ‘వీ వాంట్‌ జస్టిస్‌’ నినాదాలతో ఆడియెన్స్ హోరెత్తించారు.

ఇలాంటి ఘటనలపై నిరసనలు అవసరం

శ్రేయా ఘోషల్ ప్రోగ్రామ్‌ను తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కునాల్‌ ఘోష్‌ (Kunal Gosh) ప్రశంసించారు. ‘ఈ ఘటనపై ఆమె ఎంతో బాధపడ్డారు. తన కన్సర్ట్​ను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు మహిళల భద్రతపై పాట పాడి అందరి హృదయాలను కదిలించారు. హత్యాచారాల ఘటనలపై నిరసనలు అవసరం’ అని ఓ పోస్టు పెట్టారు. ఇక ఆర్జీ కర్‌ ఆసుపత్రి ఘటనపై శ్రేయో ఘోషల్ గతంలో స్పందిస్తూ.. ఆ ఘటన గురించి తెలిసి తన వెన్నులో వణుకు పుట్టిందని,. ఇది క్రూరమైన చర్య అని అన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *