మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగు ప్రారంభమైంది. ప్రస్తుతం మంగళూరులో జరుగుతున్న షూటింగులో తారక్ కూడా పాల్గొంటున్నాడు. ఈ షెడ్యూల్లో మేకర్స్ భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో మరో స్టార్ హీరోయిన్ కూడా భాగం కానుందట. ఇంతకీ ఆమె ఎవరంటే..?
కీలక పాత్రలో శ్రుతి హాసన్
కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruthi Haasan) ఎన్టీఆర్-నీల్ సినిమాలో భాగంగా కానుందట. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఆ పాటలోనే శ్రుతి హాసన్ స్టెప్పులేయనుందట. అంతే కాదు.. ఈ మూవీకి కీలకమైన ఓ పాత్రలో సందడి చేయనుందని టాక్. తారక్, శ్రుతి హాసన్ మధ్య కీలక సీన్స్ ఉంటాయట. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్తో శ్రుతి హాసన్ వర్క్ చేసిన విషయం తెలిసిందే.
తారక్ కోసమే స్పెషల్ సాంగ్
ఎన్టీఆర్ తో 2013లో డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) తెరకెక్కించిన రామయ్య వస్తావయ్యా సినిమాలో శ్రుతి హాసన్ నటించింది. మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సలార్ (Salaar) లోనూ ఈ భామ సందడి చేసింది. పార్ట్-2లోనూ శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుందట. ప్రశాంత్ నీల్ సినిమాలో ఎక్కువగా సాంగ్స్ ఉండవు. కానీ తారక్ డ్యాన్స్ స్కిల్స్ దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ను కథలో భాగంగా ప్లాన్ చేస్తున్నాడట నీల్. ఇక ఈ చిత్రానికి డ్రాగన్ (NTR Dragon) అనే టైటిల్ ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.






