ఈ రంగు అంటే ఆమెకు ఎందుకు అంత ప్రేమనో ఆమె మాటల్లోనే వినాలి.. “బ్లాక్ కలర్ వేసుకుంటే ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తాం. నా స్కిన్ టోన్‌కి ఈ రంగు అద్భుతంగా సరిపోతుంది. కొందరికి నలుపు అశుభం అనిపించొచ్చు, కానీ నాకు ఇది ఆనందం, కాన్ఫిడెన్స్ ఇచ్చే రంగు. ఏదైనా పనిలో ‘చేయగలనా? లేదా?’ అనే అనుమానం వచ్చినప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ధైర్యం వస్తుంది” అని శ్రుతి చెబుతుంది.
ఆమె దృష్టిలో బ్లాక్ కేవలం ఫ్యాషన్ కాదు, ఒక సేఫ్ కలర్ కూడా. “డార్క్ కలర్స్ వేసుకుంటే బయటకు వెళ్లినప్పుడు కెచప్ లేదా మరే ఇతర మరకలు పడ్డా అవి సులభంగా కనిపించవు. అందుకే బ్లాక్ ఒక ప్రాక్టికల్ ఛాయిస్” అని నవ్వుతూ చెప్పింది.
View this post on Instagram
బ్లాక్ తర్వాత శ్రుతికి నచ్చే రంగులు గ్రే, రెడ్. లేత రంగులు కూడా ఇష్టమే కానీ ఎప్పుడూ డార్క్ షేడ్స్‌కే ఓటేస్తుంది. ఈ రంగులు ఆమెకు కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా, ఆత్మవిశ్వాసం పెంచే మూడ్ బూస్టర్‌లా పనిచేస్తాయి. బ్లాక్ కలర్‌పై ఉన్న ఆమె మోజు అభిమానులకు కూడా ఫ్యాషన్ ప్రేరణగా మారింది. ప్రస్తుతం కూలీ(Coolie) సినిమాలో నటిస్తోంది.






