‘కూలీ’ హంగామా.. ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, కంపెనీ ఉద్యోగులకు సెలవులు, ఉచిత టికెట్లు!

దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఇప్పుడు ఆగస్ట్ 14 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గురువారం రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’, ఎన్టీఆర్–హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ‘వార్ 2’ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై అపారమైన బజ్ నెలకొంది. బుకింగ్స్‌లోనూ గట్టి పోటీ నెలకొని, దేశవ్యాప్తంగా టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

అయితే ‘కూలీ’ (Coolie)విడుదల సందర్భంగా అభిమానుల ఉత్సాహం మరింత పెరిగేలా కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. ముఖ్యంగా, సూపర్ స్టార్ రజినీకాంత్‌(Rajinikanth)కు వీరాభిమాని అయిన యూనో ఆక్వా కేర్ సంస్థ యజమాని, రిలీజ్ రోజున ఉద్యోగులకు సెలవు ఇవ్వడమే కాకుండా ఉచిత సినిమా టికెట్లు కూడా అందజేశారు. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మాట్టుత్తావణి, ఆరప్పాళెయం బ్రాంచ్‌లలో ఈ ఆఫర్ అమలు చేస్తున్నారు.

అదంతటితో ఆగకుండా, ఆ సంస్థ ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, విరాళాలు, ప్రజలకు స్వీట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మరిన్ని సంస్థల ఉద్యోగులు కూడా తమ కంపెనీలు ఇలాంటి సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.

లోకేష్ కనగరాజ్(Lokesh Kangaraj) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్‌–ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నాగార్జున, శృతి హాసన్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichandar) సంగీతం అందించిన ఈ చిత్రం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *