అమరావతి:మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో కీలకమైన సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చంద్రబాబుది ఏ తప్పూ లేదని… అవన్నీ నిరాధార ఆరోపణలేనని వ్యాఖ్యానించారు. ఆధారాలేం లేకుండానే అరెస్టుకు పూనుకున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సీమెన్స్ సంస్థకు రూ.370కోట్లు చెల్లించకుండానే చెల్లించినట్లు పత్రాలు సృష్టించారనే ఆరోపణలపై బాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏ ఆధారాల్లేవని మాజీ ఎండీ చెప్పడంతో జగన్ కావాలనే అరెస్టు చేశారని.. ఇంతకంటే సాక్ష్యమేం కావాలంటూ తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి.
చంద్రబాబు కేసు పై సిమెన్స్ ఎండీ సంచలన వ్యాఖ్యలు
Previous article
Next article
లేటెస్ట్