టాలీవుడ్ సింగర్ కల్పన (Singer Kalpana). ఈ పేరు తెలియని వారుండరు. తన గాత్రంతో ఎన్నో ఏళ్ల నుంచి సంగీత ప్రియులను అలరిస్తూ వస్తున్నారు. సింగింగ్, డబ్బింగ్, హోస్టింగ్, పలు టీవీ కార్యక్రమాలకు జడ్జిగా కల్పన నిత్యం లైమ్ లైట్ లోనే ఉంటారు. ఇక ఈమె గాత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారతీయ భాషలన్నింటిలోనే కాకుండా విదేశీ భాషల్లో, ఒపెరా సాంగ్స్ కూడా కల్పన పాడగలరు. దాదాపు 3వేలకు పైగా పాటలు పాడారు. ఇంత టాలెంట్ ఉన్న ఈ సింగర్ ఆత్మహత్యాయత్నం చేసిందనే వార్త ఇప్పుడు ఆమె అభిమానులను కలవరానికి గురి చేస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
హైదరాబాద్‌లోని నిజాంపేటలో నివాసముంటున్న కల్పన (Kalpana Suicide Attempt)కు మంగళవారం రోజున తన భర్త ప్రసాద్ కాల్ చేశారు. ఎంతకీ ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో అపార్ట్మెంట్ విల్లా సెక్రటరీకి ఆయన ఫోన్ చేసి సమాచారం తెలుసుకోమని చెప్పారు. అయితే అపార్ట్మెంట్ సెక్రటరీతోపాటు పలువురు అపార్ట్మెంట్ వాసులు కల్పన ఫ్లాట్ డోర్ కొట్టారు. ఎంతసేపు డోర్ కొట్టినా ఆమె స్పందించకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లగా.. ఆమె బెడ్ పై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఆమెను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కల్పన భర్త ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు తెలిపారు. ఇవాళ కల్పన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేయనున్నారు.
సూసైడ్ అటెంప్ట్ కు అదే కారణం
అయితే కల్పన ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా వారు కీలక విషయాలు రాబట్టారు. కల్పన ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణాన్ని కూడా వారు కనిపెట్టినట్లు తెలిసింది. కల్పన ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక్కరే ఉంటున్నారు. తన పెద్ద కుమార్తె కేరళలో ఉంటోంది.
అయితే కల్పన ఇటీవల తన కుమార్తెకు ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మని కోరగా.. అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయంలో ఫోన్ లోనే తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కల్పన మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోజు వేసుకునే స్లీపింగ్ పిల్స్ ను అధిక మొత్తంలో తీసుకుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు.






