అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్(Test Rankings)ను ప్రకటించింది. ఇందులో ఆస్ట్రేలియా(Australia) జట్టు 124 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్(England 115) రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. గత సంవత్సరంలో నాలుగు టెస్టు సిరీస్‌లలో మూడింటిని గెలుచుకుని రెండు స్థానాలు మెరుగైన స్థితిలో నిలిచింది. దక్షిణాఫ్రికా 112 పాయింట్లతో మూడో స్థానంలో, భారత్(India) 107 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్(95) ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు కొనసాగుతున్నాయి.
బ్యాటింగ్‌లో- టాప్5లోకి జైస్వాల్
ఇక ప్లేయర్ల వ్యక్తిగత వివరాలకొస్తే.. ఇంగ్లండ్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తర్వాత భారత క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగుపడ్డారు. యశస్వీ జైస్వాల్ (792) పాయింట్లతో టాప్-5లో నిలిచాడు. అటు రిషభ్ పంత్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 908 రేటింగ్ పాయింట్లతో టాప్ పాజిషన్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్ కే చెందిన హ్యారీ బ్రూక్ 2, కేన్ విలియమ్సన్ 3, స్టీవ్ స్మిత్ 4వ స్థానాల్లో నిలిచారు. టెస్ట్‌ల్లో నంబర్. 1 ఆల్ రౌండర్‌గా రవీంద్ర జడేజా కొనసాగుతున్నాడు. ఇంతకు ముందు 7వ స్థానంలో ఉన్న జో రూట్ ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయాడు. గస్ అట్కిన్సన్ ఒక స్థానం ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నాడు.
ఏకంగా 12 స్థానాలు మెరుగు పర్చుకున్న సిరాజ్
అటు బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ సిరీస్‌లో అదరగొట్టిన మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు. ఈ క్రమంలోనే సిరాజ్ 15వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐదవ టెస్టు నేపథ్యంలో ఏకంగా 674 పాయింట్లు సాధించాడు. తన కెరీర్ లో 674 పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సిరాజ్ కంటే ముందు భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (1వ స్థానం), రవీంద్ర జడేజా (14వ స్థానం) ఉన్నారు. ప్రసిద్ధ్ కృష్ణ(Prasidh Krishna) సైతం అత్యుత్తమంగా 59వ ర్యాంక్‌కు చేరుకుడున్నారు. అలాగే, కుల్దీప్ యాదవ్ 28వ స్థానంలో, వాషింగ్టన్ సుందర్ 46వ స్థానంలో ఉన్నారు. సిరాజ్ తన ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తే త్వరలోనే టాప్-10లోకి చేరే అవకాశం ఉంది.
Big moves in the ICC Men’s Test Batting Rankings top 10 👊
More 👉 https://t.co/O2f86GzxYs pic.twitter.com/Qnhp03QRVB
— ICC (@ICC) August 6, 2025






