తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అత్యంత ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న నిర్ణయాలలో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) జారీ ఒకటి. ఇందుకోసం ఇప్పటికే దరకాస్తులు(Applications) స్వీకరిస్తున్న సర్కార్.. తర్వలోనే కొత్త కార్డులను జారీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు సీఎం రేవంత్(CM Revanth) తాజాగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త, పాత కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డులు(Smart Cards) అందజేయాలని సీఎం ఆదేశించారు. దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఉగాది(Ugadi Festival) రోజు కొత్త కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది.
స్మార్ట్ రేషన్ కార్డులపై క్యూఆర్ కోడ్
ఇదిలా ఉండగా ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్(QR Code) పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా(Adress), క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ టెండర్లను ఆహ్వానించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కోటి, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి 20లక్షల చొప్పున మొత్తం 1.20 కోట్ల రేషన్ కార్డుల ముద్రణకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది.

అందుకే కార్డుల పంపిణీ ఆలస్యం
రాష్ట్రంలో దాదాపు 90లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలో జిల్లాల వారీగా ప్రభుత్వం అర్హులను గుర్తించింది. వారికి ఎన్నికల కోడ్(Election Code) లేని జిల్లాల్లో మార్చి 1వ తేదీ నుంచి, మిగతా జిల్లాల్లో మార్చి 8వ తేదీ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.






