Sonam Kapoor: సోనమ్ కపూర్‌కి రూ.231కోట్ల విలువైన గిఫ్ట్.. ఇచ్చిందెవరంటే!

ManaEnadu: బాలీవుడ్ బ్యూటీ సోనమ్‌ కపూర్‌(Sonam Kapoor).. ఆమె గురించి స్పెషల్ ఇంట్రాడక్షన్ అవసరం లేదు. బాలీవుడ్ స్టార్(Bollywood Star) హీరో అనిల్ కపూర్(Anil kapoor) కుమార్తె ఈ బ్యూటీ. తండ్రి వారసత్వంలో ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక స్టార్‌ డమ్ సొంతం చేసుకుంది. అంతేకాదు తన నటనతో కెరీర్‌లో నాలుగు ఫిలింఫేర్ అవార్డు(Filmfare Awards)లూ అందుకుంది. 2018 మేలో ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహుజా(Anand Ahuja)ను పెళ్లాడింది. వీరికి రెండేళ్ల కొడుకు. మ్యారేజ్ అయిన తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. కానీ, పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వల్ల ఎప్పుడూ వార్తల్లో నిలుస్తునే ఉందీ బ్యూటీ.

 లండన్‌లోనే ఉంటారా..?

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ వెండితెరకు దూరంగా ఉన్నా సోషల్ మీడియా(Social Media)లో ఎప్పుడూ యాక్టీవ్‌గానే ఉంటుంది. అయితే తాజాగా ఈ అమ్మడిపై ఓ న్యూస్ బీటౌన్‌(B-Town)లో చక్కర్లు కొడుతోంది. తన భర్త ఆనంద్ అహుజా, కొడుకుతో కలిసి లండన్‌(London)ను మకాం మార్చబోతుందట. ఇటీవల తన మామ, వ్యాపారవేత్త హరీశ్ అహుజా(Harish Ahuja) లండన్‌లోని ఓ విశాలమైన విల్లా (Villa)ను అహుజా దంపతుల కోసం కొనుగోలు చేశాడట. ఈ లగ్జరీ భవనంలోనే ఆమె తన ఫ్యామిలీతో ఉండాలని సోనమ్ భావిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సోనమ్ మామ ఓ బడా వ్యాపారవేత్త

లండన్ లోని అత్యంత విశాలమైన(luxury house) 8 అంతస్తుల రెసిడెన్షియల్ కాన్వెంట్‌ను సోనమ్ కపూర్ మామ హరీశ్ అహుజా జులైలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విల్లాలో నిర్మాణ పనులు జరుగుతున్నాయట. దీనిని సోనమ్‌కు గిప్టు(Gift)గా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. నాటింగ్ హిల్‌లోని లగ్జరీ ఇల్లు కోసం 27 మిలియన్ డాలర్లు వెచ్చించినట్టు టాక్. మన కరెన్సీలో సుమారు రూ. 231.47 కోట్లు. ఈ బిల్డింగ్ దాదాపు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందట. ఇక సోనమ్ మామ హరీశ్ అహుజా ఓ బడా బిజినెస్ మ్యాన్(Business Man). ఆయన షాహీ ఎక్స్‌పోర్ట్స్ అనే టెక్స్ టైల్స్ (Shahi Exports Named Textiles) బిజిసెన్‌ను రన్ చేస్తున్నారు. ఇది ఇండియాలోనే అతిపెద్ద వస్త్ర తయారీ కంపెనీ(Textile manufacturing company)లలో ఒకటి.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *