ManaEnadu: చెన్నై టెస్టు(Chennai Test)లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపుతోంది. దీంతో తొలి టెస్టుపై టీమ్ఇండియా(Team India) పట్టు బిగించింది. 2వ రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్(2nd Innings)లో భారత్ 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమ్ఇండియా 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. గిల్ (33), పంత్ (12) క్రీజులో ఉన్నారు. 227 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. మరోసారి కెప్టెన్ రోహిత్ (5) తక్కువ స్కోరుకే పరిమితం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన జైస్వాల్ (10), తన పేలవ ఫామ్ కంటిన్యూ చేస్తూ Kohli (17)లు పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో టీమ్ఇండియా 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. పంత్‌తో కలిసి రెండో రోజు ఆటను ముగించాడు.
మనోళ్ల బౌలింగ్‌కు బెంబేలెత్తారు..
అంతకుముందు బంగ్లాదేశ్(Bangladesh) తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ (32), మెహిదీ హసన్ (27 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(Bumrah) 4 వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్, జడేజా(Jadeja), సిరాజ్‌లు తలా 2వికెట్లు పడగొట్టారు. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్(R Ashwin) (113) సెంచరీ చేయగా రవీంద్ర జడేజా (86), జైస్వాల్ (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 5 వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్ 3వికెట్లు, నహిద్ రానా, మెహిదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
Boom Boom Bumrah 🎇
Cleans up Shadman Islam with a peach of a delivery.
Live – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank | @Jaspritbumrah93 pic.twitter.com/RYi9AX30eA
— BCCI (@BCCI) September 20, 2024
400 వికెట్ల క్లబ్‌లో బుమ్రా
టీమ్‌ఇండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లో 400 వికెట్లు పూర్తిచేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఆరో భారత పేసర్‌గా నిలిచాడు. బంగ్లాతో తొలి టెస్టులో ఆయన ఈ మైలురాయిని అందుకున్నారడు. అంతకుముందు కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్(597), జవగల్ శ్రీనాథ్(551), షమీ (448), ఇషాంత్ (434) ఈ ఫీట్‌ను సాధించారు. అటు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. సొంత గడ్డపై అత్యధిక పరుగులు పూర్తి చేసుకున్న ఐదో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన 12,000 పరుగుల మైలురాయి చేరుకుని ఈ ఫీట్ సాధించాడు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) (14,192) ఉన్నారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ (13,117), జాక్వెస్ కలిస్ (12,305), కుమార సంగక్కర (12,043) నిలిచారు.








