IND vs ENG 3rd Test | తొలి సెష‌న్‌లో భార‌త బౌల‌ర్ల జోరు..

లంచ్ టైమ్‌కు ఇంగ్లండ్ స్కోర్..? IND vs ENG 3rd Test : రాజ్‌కోట్ టెస్టులో మూడో రోజు భార‌త బౌల‌ర్లు చెల‌రేగారు. దాంతో, ఇంగ్లండ్ కీల‌క‌మైన మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. తొలి సెష‌న్ మొద‌లైన కాసేప‌టికే జో రూట్(18)ను బుమ్రా బోల్తా కొట్టించాడు.

IND vs ENG 3rd Test : రాజ్‌కోట్ టెస్టులో మూడో రోజు భార‌త బౌల‌ర్లు చెల‌రేగారు. దాంతో, ఇంగ్లండ్ కీల‌క‌మైన మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. తొలి సెష‌న్ మొద‌లైన కాసేప‌టికే జో రూట్(18)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆ త‌ర్వాత కుల్దీప్ యాద‌వ్ డేంజ‌ర‌స్ జానీ బెయిర్‌స్టో(0), ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డ‌కెట్ (153)ల‌ను ఔట్ చేసి భార‌త్‌ను పోటీలో నిలిపాడు.

ప్ర‌స్తుతం కెప్టెన్ బెన్ స్టోక్స్(39 నాటౌట్), వికెట్ కీప‌ర్ బెన్ ఫోక్స్‌(6 నాటౌట్)లు ఆడుతున్నారు. వీళ్లిద్ద‌రూ ఆరో వికెట్‌కు ప‌రుగులు జోడించారు. దాంతో, లంచ్ స‌మ‌యానికి ఇంగ్లండ్ 290 ర‌న్స్ కొట్టింది. స్టోక్స్ సేన ఇంకా 155 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది.

వైజాగ్ టెస్టులో స్టోక్స్ సేన‌ను చిత్తు చేసిన భార‌త్ కీల‌క‌మైన రాజ్‌కోట్ టెస్టులోనూ ప‌ట్టు బిగిస్తోంది. తొలుత 445 ప‌రుగుల‌ భారీ స్కోర్ చేసింది. తొలిరోజు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(132), ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(112)లు శ‌త‌కాల‌తో క‌దం తొక్కారు. అరంగేట్రం చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్(62), ధ్రువ్ జురెల్‌(46)లు ధ‌నాధ‌న్ ఆడ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 ర‌న్స్ కొట్టింది.

అనంత‌రం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఓపెన‌ర్ బెన్ డ‌కెట్(155), జాక్ క్రాలే(15) శుభారంభం అందించారు. అయితే.. అశ్విన్ బౌలింగ్‌లో క్రాలే ఔట్ కాగా.. ఉప్ప‌ల్ టెస్టు హీరో పోప్‌(39)ను సిరాజ్ ఎల్బీగా వెన‌క్కి పంపాడు. దాంతో, తొలి రోజు ఆట‌ముగ‌సే స‌రికి ఇంగ్లండ్ 2 వికెట్ల న‌ష్టానికి 207 ర‌న్స్ కొట్టింది.

Share post:

లేటెస్ట్