శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు.. కొనసాగుతున్న ఓటింగ్‌

Mana Enadu : శ్రీలంక పార్లమెంట్‌(Sri Lanka)కు గురువారం (నవంబరు 14న) ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఉదయం నుంచే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో 1.70కోట్లకు పైగా ఓటర్లు పాల్గొంటున్నారు. 225 మంది ఎంపీలను వారు ఎన్నుకోనున్నారు.

అధ్యక్షుడు అరుణకుమార దిస్సనాయకే నేతృత్వంలోని అధికార ‘నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(National Peoples Power)’ పార్టీకి ఈ ఎన్నికలు (Sri Lanka Elections) పరీక్షగా నిలిచాయి. సెప్టెంబరు 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఆయన 50శాతం ఓట్లు కూడా సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా మొత్తం 225 పార్లమెంట్‌ సీట్లలో 196 స్థానాలకు ఎంపీలను ఎన్నుకోనున్నారు.

నవంబరు 14న ఫలితాలు

నేషనల్‌ లిస్ట్‌ సీట్లుగా పిలిచే.. మిగతా 29 సీట్లను దేశవ్యాప్తంగా ఆయా పార్టీలు/గ్రూప్‌లకు దక్కిన ఓట్ల శాతం ఆధారంగా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల గ్రూప్‌లకు కేటాయిస్తారు. 196 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల బరిలో (Sri Lanka Parliament Elections) 8,821 మంది అభ్యర్థులు నిలిచారు. ఓటింగ్‌ పూర్తయిన అనంతరం కౌంటింగ్‌ జరగనుంది. శుక్రవారం (నవంబరు 14న) ఫలితాలు వెల్లడి కానున్నాయి.

సంక్షోభం తర్వాత తొలి ఎన్నిక 

అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన విక్రమసింఘె ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అటు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న రాజపక్సే సోదరులు.. మహింద, గొటబాయ, చమల్‌, బసిల్‌ ఎవరూ కూడా బరిలో లేరు. 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత శ్రీలంక (Sri Lanka)లో ఇది తొలి పార్లమెంట్ ఎన్నిక. 

Related Posts

కుమారుడికి క్షమాభిక్ష.. జో బైడెన్‌ నిర్ణయంపై ట్రంప్ గరం

Mana Enadu : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) తాను అధ్యక్ష పీఠం దిగబోయే ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌కు కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించారు. అక్రమంగా ఆయుధం కొనుగోలు సహా రెండు…

ప్రధాని మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

Mana Enadu : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం రోజున మూడు దేశాల పర్యటనకు బయల్దేరారు. మొదట నైజీరియాలో పర్యటిస్తున్న ఆయన ఆ తర్వాత బ్రెజిల్.. అనంతరం గయానాలో పర్యటించనున్నారు. 17 ఏళ్లలో ప్రధాని మోదీ నైజీరియాలో పర్యటించడం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *