నందమూరి స్టార్ హీరో ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్ 2(WAR-2)’. ఈ సినిమాతో యంగ్‌టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ(Ayaan Mukherjee) దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ స్పై యూనివర్స్(Yash Raj Spy Universe)లో భాగంగా వస్తున్న ఈ సినిమాపై హిందీతో పాటూ తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే..
హృతిక్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ రోల్
ఎన్టీఆర్-హృతిక్ రోషన్ మల్టీస్టారర్(multistarrer)గా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ వార్-2(War-2)పై అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి న్యూస్ రివీల్ అయినా సోషల్ మీడియా(Social media)లో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మల్టీస్టారర్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్(special song)కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్( Shraddha Kapoor) ఆ స్పెషల్ సాంగ్‌లో NTR, హృతిక్‌తో కలిసి స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మూవీ టీమ్ స్పందించాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హృతిక్ పాత్రకు దీటుగా NTR రోల్ ఉంటుందట. ఈ మధ్యనే ముంబైలో ఈ ఇద్దరిపై ఫైట్ సీన్లు చిత్రీకరించారు.
స్త్రీ-2 మూవీ హిట్‌తో శ్రద్ధాకి ఆఫర్?
ఇదిలా ఉండగా శ్రద్ధా కపూర్ ఇటీవల స్త్రీ-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.800 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. 2018లో శ్రద్థాకపూర్, రాజ్‌కుమార్ రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘ స్త్రీ ’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. హారర్ కామెడీగా ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న బాక్సాఫీసు ముందుకొచ్చి భారీ సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలోనే శద్ధాని వార్-2 కోసం తీసుకున్నట్లు B-టౌన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.






